కిస్సింగ్ సీన్స్ ఎలా చేయాలో నా తండ్రే చెప్పాడు: ప్రముఖ నటి

Update: 2021-04-01 23:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు చాలా కామన్. నిజానికి బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ లేకపోతే ఓ వర్గం ప్రేక్షకులు సంతృప్తి చెందరు. ఒకప్పుడు అంటే శృంగార సన్నివేశాలు సినిమా కథకు బాగా అవసరం అయితేనే షూట్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అలా లేదు. అసలు సినిమా హిట్ అవ్వాలంటేనే ముద్దులు, బెడ్ సీన్స్ అవసరం అనే స్థాయిలో వాటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వారి ఆలోచనకు తగ్గట్టుగానే ఓ వర్గం ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఎక్సపెక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ రొమాంటిక్ హీరోయిన్, డైరెక్టర్ పూజా భట్.. తన ఫస్ట్ కిస్ సీన్ గురించి మీడియాకు వివరించింది. ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు అయినటువంటి పూజా 1991లో 'సడక్' సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఐతే ఆ సినిమాకు మహేష్ భట్ దర్శకుడు. తండ్రి దర్శకత్వంలో సినిమా చేయడం బాగానే ఉంది. కానీ ఫస్ట్ సినిమాలోనే ముద్దు సన్నివేశం అనేసరికి కాస్తా భయపడిందట. అదిగాక తన తండ్రే ఆ కిస్ సీన్ చేయాలనీ పట్టుబట్టేసరికి పూజా ఒప్పుకోక తప్పలేదట. సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన సడక్ సినిమా సమయంలో పూజా వయసు 18సంవత్సరాలు. మొదట్లో సీన్ చేసేందుకు చాలా భయపడితే మహేష్ భట్ కూతురును పక్కకు పిలిచి.. ఒప్పించడం జరిగింది. మరి ఏం చెప్పి ఒప్పించాడు..? అనే ప్రశ్నకు పూజా స్పందించి.. ''చూడు పూజా.. నువ్ ఆ ముద్దు సన్నివేశం, లేదా కిస్ చేయడం అసభ్యంగా భావిస్తే అది అలాగే అనిపిస్తుంది చేయలేవు. అదే సీన్ సినిమాకు ముఖ్యమని ఆలోచించు నీకే ఆ సీన్ విలువ అర్ధమవుతుంది" అని చెప్పారని.. అలాగే అప్పటినుండి నేను ఆ మాటలే ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఐతే పూజా భట్ చివరిగా ఇటీవలే విడుదలైన 'బొంబాయి బేగమ్స్' సిరీస్ లో నటించింది.
Tags:    

Similar News