ఇంట్లో మెట్ల మీద నుంచి జారిపడి మరణించిన అపర కుబేరుడు

Update: 2021-03-06 11:30 GMT
చావు తన మీద ఎలాంటి తప్పు వేసుకోదని పెద్దోళ్లు పదే పదే చెబుతుంటాయి. చావు ఏదైనా ఏదో ఒక కారణం చూపించటం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి విషాద ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ప్రముఖుల్లో ఒకరైన సదరు వ్యాపారస్తుడు తాజాగా మరణించారు. ఇంతకీ ఆ అపర కుబేరుడి మరణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మూత్తూట్ గ్రూప్ ఛైర్మన్ గా వ్యవమరిస్తున్న 72 ఏళ్ల జార్జ్ ముత్తూట్.

నిన్న రాత్రి (శుక్రవారం) ఢిల్లీలోని తన సొంత ఇంట్లో మెట్లు మీద నుంచి వెళ్లేటప్పుడు ఆయన పట్టుతప్పి కిందకు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే మరణించినట్లుగా చెబుతున్నారు. మెట్లమీద నుంచి జారి పడిపోయిన వెంటనే.. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విచినట్లుగాచెబుతున్నారు.

మూత్తూట్ ఛైర్మన్ కు ముగ్గురు కుమారులు. 1979లో ఆయన జన్మించారు. 1993లో ఆయన గ్రూపుల ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని కంపెనీ రూ.51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేసన్ పెంచేశారు. దీంతో.. కంపెనీ ఆదాయం రూ.8772 కోట్లకు చేరింది. ఆయనకు భార్య జార్జ్.. ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒక కొడుకు హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఉదంతం సంచలనంగా మారింది.

పెద్ద కొడుకు జార్జ్ ఎం జార్జ్ గ్రూపు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గా ఉంటే.. భార్య సారా జార్జ్ ముత్తూట్ ఢిల్లీలోని సెయింట్ జార్జ్ హైస్కూల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫోర్భ్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ తరఫున జార్జ్ ముత్తూట్ 44వ స్థానంలో ఉన్నట్లుగా వెల్లడించారు. అలాంటి అపర కుబేరుడు మెట్లు ఎక్కుతూ జారి పడి మరణించటం చూస్తే.. చావును ఎవరూ ఆపలేరేమో అంటే ఇదేనేమో!




Tags:    

Similar News