• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఏజెంట్' మూవీలో...

'ఏజెంట్' మూవీలో మల్టీటాలెంటెడ్ స్టార్..?

By - Tupaki Desk
Update: 2021-06-05 03:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర పరభాషా హీరోల హవా కూడా బాగునే ఉంటుంది. ఎందుకంటే పరభాషా నటులే విభిన్నమైన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంటున్నారు. అలా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన కన్నడ హీరో ఉపేంద్ర. ఈ స్టార్ దర్శకుడిగా తన సినీప్రయాణం ప్రారంభించినప్పటికీ ఓ నటుడిగా.. ఓ కథారచయితగా.. పాటల రచయితగా.. సంగీత దర్శకుడిగా ఇలా అన్నింట్లో తన సత్తా చాటుతూ విభిన్నమైన సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు ఉపేంద్ర.

చివరిగా ఆర్. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రూపొందిన ఐ లవ్ యు మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మరోసారి అదే దర్శకుడితో ఉపేంద్ర 'కబ్జా' అనే భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న కబ్జా మూవీ పై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను కేజీఎఫ్ మాదిరిగా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లో అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్ చేసి వెళ్తుంటాడు ఉపేంద్ర. చాలా ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ నటించిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మూవీలో పవర్ ఫుల్ రోల్ చేసాడు.

అయితే ఇప్పుడు మరోసారి ఈ హీరో ఓ యాక్షన్ మూవీలో అలరించే అవకాశం కనిపిస్తుంది. ఎలాగంటే.. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కంప్లీట్ చేసి 'ఏజెంట్' అనే పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే ఖచ్చితంగా సినిమాను డైరెక్టర్ భారీ రేంజిలో ప్లాన్ చేసాడని అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు సినిమాలో కాస్టింగ్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఏజెంట్ లో ఓ కీలక పాత్రకోసం మేకర్స్ ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తుంది. అలాగే స్క్రిప్ట్ కూడా వినిపించడం జరిగిందని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఉపేంద్ర రెస్పాన్స్ గురించి ఏజెంట్ టీమ్ వెయిట్ చేస్తోందట. చూడాలి మరి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉపేంద్ర ఓకే చేస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
Tags:    
  • Upendra 
  • Akhil Akkineni 
  • Agent 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS