‘పుష్ప’ టీంకిది న్యాయమా?
రూ.180 కోట్లు.. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ‘పుష్ప’ మీద పెట్టిన బడ్జెట్ ఇది. మరి ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలో క్వాలిటీ ఎలా ఉండాలి? ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గకూడదు. మామూలుగానే సుకుమార్ సినిమాలు టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉంటాయి. పైగా ఆయన్నుంచి ‘రంగస్థలం’ లాంటి టాప్ క్లాస్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం, పైగా ఇంత బడ్జెట్ పెట్టారంటే సాంకేతికంగా మరింత ఉన్నత ప్రమాణాలను ఊహించుకుంటాం.
కానీ ‘పుష్ప’ సినిమా చూసిన వాళ్లందరూ టెక్నికల్‌గా ఇంత వీక్‌గా ఉందేంటి అని అవాక్కయ్యారు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కింగ్ అయిన దేవిశ్రీ ప్రసాద్.. సౌండ్ డిజైన్‌కు ఆస్కార్ అవార్డు అందుకున్న రసూల్ పొకుట్టి.. ‘గ్యాంగ్ లీడర్’తో సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించిన మిరస్లోవ్ కూబా లాంటి వాళ్లు పని చేసినా.. వీళ్లందరికీ కెప్టెన్‌గా సుకుమార్ ఉండగా.. తెరపై ఆయా విభాగాల్లో కనిపించిన లో క్వాలిటీకి షాకవకుండా ఉండలేరు.
అలాగని నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. అయినా తెరపై క్వాలిటీ కనిపించకపోవడానికి.. విజువల్స్ డల్లుగా ఉండటానికి.. సౌండ్ డిజైన్ ఎఫెక్టివ్‌గా ఉండటానికి, బ్యాగ్రౌండ్ స్కోర్ దేవి స్థాయికి తగ్గట్లు లేకపోవడానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ చాలా హడావుడిగా చేయడమే. విడుదలకు రెండు వారాల ముందు వరకు షూటింగ్ చేసి.. బోలెడంత రష్ పట్టుకొచ్చి ఎడిటర్ దగ్గర పడేయడం వల్లో ఏమో.. ఎడిటింగ్ షార్ప్‌గా లేకపోయింది. సినిమాలో ల్యాగ్ ఎక్కువైంది.
డిజిటల్ ఇంటర్మీడియట్, సౌండ్ డిజైన్, ఫైనల్ మిక్సింగ్.. ఇలా ప్రతి విభాగంలోనూ లో క్వాలిటీ కనిపించింది. మల్టీప్లెక్సుల్లో సైతం ఏ ఎఫెక్ట్ సరిగా అనిపించలేదు. ఈ స్థాయి సినిమాలో ఉండాల్సిన క్వాలిటీ కనిపించలేదు. అసలు యుఎస్‌కైతే ఫినిష్డ్ ప్రాడక్టే వెళ్లలేదట. ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్ సరిగా చేయని కాపీని పంపడంతో అక్కడ గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలినంత సమయం లేనపుడు సినిమా వాయిదా వేసుకోవాల్సింది కానీ.. ఇలా హడావుడిగా పని ముగించి సినిమాను జనాల మీదికి వదిలేయడం కచ్చితంగా తప్పే.