జబర్దస్త్ డబ్బులు వసూలు చేసింది.. బిగ్ బాస్ అప్పులు తీర్చింది : అవినాష్

Update: 2020-12-25 05:04 GMT
బుల్లి తెరకావొచ్చు.. వెండి తెర కావొచ్చు.. తెరపైకి ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు. కానీ.. కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. అలాంటి వారిలో ఒకడు ముక్కు అవినాష్. మల్లెమాల ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్.. ఆ షోలో ఉన్నంత కాలం ఆడియన్స్ ను అలరించాడు. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్-4 లోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. అందరి dRshTiకీ మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, బిగ్ బాస్ ద్వారా కలిగిన ప్రయోజనం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అవినాష్.

మిమిక్రీతో...
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించాడు అవినాష్. ఆ సమయంలోనే హీరోలను ఇమిటేట్ చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. అలా.. జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో మొదట కొన్ని టీమ్‌లలో ఆర్టిస్టుగా పని చేశాడు. ఆ సమయంలో తనలోని టాలెంట్ ను మరింతగా నిరూపించుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు అతడికి లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

రూ.10 లక్షలు వసూలు..
జబర్ధస్త్‌ను వీడడం వెనుక కారణాన్ని అవినాష్ చెప్పాడు. బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో తప్పక వెళ్లాల్సి వచ్చిందని, అయితే.. రెండిట్లో ఏదో ఒకటే అని పరిస్థితి రావడంతో హౌస్ లోకి వెళ్లడానికే సిద్ధపడ్డట్టు చెప్పాడు. అయితే.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సమయంలో తన నుంచి రూ. 10 లక్షలు వసూలు చేశారని కూడా చెప్పాడు. అలాంటి క్లిష్ట సమయంలో యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రలు అండగా నిలిచి, డబ్బు సహాయం చేశారని చెప్పాడు అవినాష్.

ఆర్థిక ఇబ్బందులు..
‘కొన్ని రోజుల క్రితం ఫ్లాట్ కొన్నాను. అప్పుడే అమ్మానాన్నకు ఆపరేషన్ చేయించాను. దీంతో.. ఆర్థికంగా చాలా భారం పడిపోయింది. లాక్‌డౌన్ సమయంలో డబ్బులు సరిగా ఉండేవి కాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక సందర్భంలో కొత్త ఇంటి మీద నుంచి దూకేద్దాం అనుకున్నా' అని తెలిపాడు అవినాష్.

హౌస్ లో సందడి..
బిగ్ బాస్ నాలుగో సీజన్లో.. తనను జోకర్‌గా పరిచయం చేసుకుంటూ హౌస్‌లోకి ప్రవేశించిన అవినాష్.. ఆ పేరును సార్థకం చేసుకున్నాడు. అందరికీ కామెడీని పంచాడు. నవ్వుతూ నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. ఆటపట్టిస్తూ అల్లరి చిల్లరగా హౌస్ లో గడిపాడు. ఈ విధంగా.. ఉన్నన్ని రోజులూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసి, బెస్ట్ ఎంటర్‌టైనర్ అన్న పేరు తెచ్చుకున్నాడు.

అప్పులు తీరాయి..
జనవరి నుంచి బిగ్ బాస్ వాళ్లు వరుసగా ఫోన్లు చేశారని, అప్పుడే తన తన ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో ఓకే చెప్పానన్నాడు అవినాష్. ఈ షోలోకి వెళ్లడం వల్ల జబర్ధస్త్ కోసం చేసిన రూ. 10 లక్షలతో పాటు తన అప్పులన్నీ తీరిపోయాయని చెప్పాడు. ‘హౌస్ లోకి వెళ్లడం వల్ల పేరుతో పాటు డబ్బు వచ్చింది. బిగ్ బాస్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పాడు అవినాష్. కాగా.. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ రూ. 40 లక్షల వరకు తీసుకున్నాడన్న టాక్.
Tags:    

Similar News