ఆమె గ్లామర్ గురించే డిస్కషన్లన్నీ
సౌత్ లో హాట్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా అందులో చాలా మంది అనుకున్న రేంజ్ లో పాపులర్ అవ్వడం లేదు. గ్లామర్ టచ్ ఇస్తే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారు అనుకునే రోజులు పోయాయి. కథలో భాగంగా అన్ని అనుభూతులు కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే సినిమా హిట్ అవుతుంది. అప్పుడే హాట్ హీరోయిన్స్ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చాలా రోజులుగా రెజీనా కాసండ్రా కూడా తన గ్లామర్ అందాలతో ఒక్క హిట్ అయినా కొట్టాలని తెగ ప్రయత్నిస్తోంది.
కోలీవుడ్ సీనియర్ హీరో కార్తిక్ అలాగే అతని తనయుడు గౌతమ్ కార్తిక్ నటించిన సినిమా మిస్టర్ చంద్రమౌళి. ఈ సినిమాలో గౌతమ్ కి జోడిగా రెజీనా నటిస్తోంది. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. ఎక్కువగా రెజీనా హాట్ స్టిల్స్ తో ప్రేక్షకులకు గాలం వేస్తున్నారు. ట్రైలర్ లో పెద్దగా ఆకర్షించే అంశాలు కనిపించడం లేదు. కోలీవుడ్ లో ఈ మిస్టర్ చంద్రమౌళి ఎంతవరకు ప్రేక్షకులను ఆకర్షిస్తోందో గాని తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
మనవాళ్లు కార్తీక్ ని మర్చిపోయి చాలా కాలమవుతోంది. అలాగే గౌతమ్ కార్తిక్ కడలి ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక వారి దగ్గర ఉన్న ఆయుధం ఒకటే.. రెజీనా అందాలతో తెలుగు ఆడియేన్స్ ని ఆకర్షించాలని చూస్తున్నారు. బీచ్ అందాలు చిత్రంలో బాగానే ఉన్నాయి. అంతే కాకుండా రెజీనా గ్లామర్ డోస్ ఇందులో చాలా పెంచేసింది. దీంతో సినిమాకు ఆడియెన్స్ ఎంతవరకు పెరుగుతారనేది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్లోని కంటెంట్ కంటే.. అందులో రెజీనా గ్లామర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View