'ఫ్రైడే మూవీస్' ద్వారా ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమా థియేటర్
కరోనా మహమ్మారి వల్ల బయటకు వెళ్లడానికి భయపడుతున్న ప్రేక్షకుల కోసం ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే అందజేసేందుకు అనేక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇండిపెండెంట్ సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఫ్రైడే మూవీస్' అనే మరో కొత్త డిజిటల్ వేదిక వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ముందుగా ఈ యాప్ లో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'డర్టీ హరి' చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు - గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి - వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రవణ్ రెడ్డి - రుహానీ శర్మ - సిమ్రత్ కౌర్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. 'డర్టీ హరి' రిలీజ్ అవుతున్న సందర్భంగా 'ఫ్రైడే మూవీస్' యాప్ తరుపన అనురాగ్ పర్వతనేని మరియు విజయ్ మద్దూరి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 'ఫ్రైడే మూవీస్' యాప్ ప్రమోటర్స్ విజయ్ మద్దూరి మరియు అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ.. ''కరోనా ప్యాండమిక్ వలన అందరూ ఇళ్ళకు పరిమితమయ్యారు. ఇప్పడిప్పుడే కొంతవరకూ పరిస్థితులు మారుతున్నాయి. జనసంచారం వున్న ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంకా మనసులో భయం మాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో అందరికి అందుబాటులో వుండేలా ఒక ఏటిటి సిద్దమైంది. మీ ఇంటికే వచ్చి మంచి సినిమాల్ని మీ ఇంట్లో మీకు సర్వ్ చేయబోతుంది. ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా విడుదలవుతుందో పేపర్స్ లో చూసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రాఫిక్ లో థియేటర్ కి వెళ్ళి పార్కింగ్ చేసుకునేలోపు సినిమా స్టార్టవుతుందేమో అనే కంగారు ఇక నుండి లేకుండా ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వస్తుంది. దీని కోసం మీరు 7997666666 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ మొబైల్ లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మొబైల్ లో వుంచుతుంది. అలానే ఈ యాప్ ద్వారా 'డర్టీ హరి' సినిమా చూడాలనుకునే వారు 120 రూపాయలు టిక్కెట్ ధర చెల్లించవలసి ఉంటుంది. ప్రతి వారం కొత్త సినిమాలతో పాటు సర్ ప్రైజ్ చేసే మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి'' అని తెలిపారు.