• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూకు దక్కని అదృష్టం.....

చైతూకు దక్కని అదృష్టం.. అఖిల్ కు సొంతమైంది

By - Tupaki Desk
Update: 2021-10-14 07:08 GMT
అన్నింటితో పాటు.. కాసింత అదృష్టం కూడా చాలా అవసరం. ఈ విషయంలో మిగిలిన రంగాల్లో ఎంతో అవసరం. సినిమా రంగానికి మరింత అవసరం. అదృష్టం లేకపోతే ఎంత అద్భుతమైన సినిమా అయినా అట్టర్ ప్లాప్ అన్నట్లుగా మారుతుంటుంది. సినిమాకు టైమింగ్ తోపాటు.. చుట్టూ వాతావరణం కలిసి రావాలి. అప్పుడు మాత్రమే మేజిక్ క్రియేట్ అవుతుంటుంది. కొన్ని సినిమా చాలా బాగున్నా.. దానికి సరైన టాక్ లేకపోవటం.. లేదంటే సరైన టైమింగ్ కాకపోవటం.. థియేటర్లు తక్కువగా ఉండటం ఇలాంటివెన్నో ఒక సినిమా ఫేట్ ను డిసైడ్ చేస్తుంటాయి.

తాజాగా నాగచైతన్య.. అఖిల్ విషయానికి వస్తే.. అన్నకు దక్కని అదృష్టం తమ్ముడికి దక్కిందన్న మాట వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండస్ట్రీలో బాగా బజ్ ఉన్న సినిమాగా ప్రచారం పొందటమే కాదు గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ శేఖర్ కమ్ముల మూవీ ‘లవ్ స్టొరీ’. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ రికవరీ కావటానికికాస్త ఎక్కువ సమయం పట్టిందనే చెప్పాలి. ఏపీలోని పరిస్థితులు కూడా దీనికి కారణమని చెప్పాలి.

ఇలాంటి ప్రతికూల వాతావరణంలో విడుదలైన లవ్ స్టోరీ ఆశించినంత మేర కలెక్షన్లు రాబట్టటమే కాదు.. మూడో వారంలోనూ పలు థియేటర్లలో రన్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో వారంలో సినిమా రన్ కావటమే గొప్ప. అలాంటిది మూడో వారంలోనూ బొమ్మ వెండి తెర మీద పడుతుందంటే మాటలా? అయితే.. ఏపీ ప్రభుత్వం తాజాగా వంద శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెప్పిన వైనం సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేదిగా చెప్పాలి. ఇదే నిర్ణయం లవ్ స్టోరీ సమయానికే ఇచ్చి ఉంటే.. దాని కలెక్షన్లు మరింత పెరిగేవన్న మాట వినిపిస్తోంది. దాదాపు రూ.32 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే కలెక్షన్లు కూడా వచ్చాయన్న మాట వినిపిస్తోంది.

ఓవర్ సీస్ లో కలెక్షన్లు బాగుండటం.. తెలంగాణలోనూ కలెక్షన్లు ఆశాజనకంగా ఉండటం.కొద్దో గొప్పో ఏపీలో కలెక్షన్లు లేకపోవటం నిరాశను కల్పించినా.. మొత్తంగా చూస్తే.. ఫర్లేదనే చెబుతారు. మరో రోజులోచైతూ సోదరుడు అఖిల్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెద్ద పండుగ అయిన దసరా.. అందరూ సెలవులకు వచ్చి ఉండటం.. గతంలో మాదిరి ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెప్పటం.. కరోనా భయం గడిచిన నెలలో మరింత తగ్గగటం లాంటి సానుకూల అంశాల్ని చూసినప్పుడు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కు మంచి కలెక్షన్లు ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. ఇదంతా చూసినప్పుడు అన్న చైతూతో పోలిస్తే.. అఖిల్ కు అదృష్టం కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది. భారీ అంచనాలు ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తుది ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని గంటలు తేల్చేయనుందని చెప్పాలి.
Tags:    
  • AkhilAkkineni 
  • MostEligibleBachelor 
  • MEBOnOct15th 
  • pooja hegde 
  • lovestory 
  • naga chaitanya 
  • sai pallavi 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS