డ్రగ్స్ కేసులో మరింత మందికి నోటీసులు ?

Update: 2020-11-12 10:50 GMT
బాలీవుడ్ సెలబ్రిటీలను డ్రగ్స్ స్కాండల్ వ్యవహారం ఇప్పట్లో వదిలి పెట్టేలా లేదు. తాజాగా గబ్రియేలా దిమిట్రియేడ్స్ ను నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. గాబ్రియేలా అంటే వర్ధమాన హీరో  అర్జున్ రామ్ పల్  గర్ల్ ఫ్రెండ్. ఇద్దరిని విచారణకు రమ్మని ఎన్సీబీ నోటీసులిస్తే గాబ్రియేలా మాత్రమే విచారణకు హాజరయ్యింది. అర్జున్ శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

వివాదాస్పదమైన సుశాంత్ సింగ్  ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా చాలామంది సెలబ్రిటీలను పోలీసులు విచారణ జరిపారు. అయితే ఈ నేపధ్యంలోనే సెలబ్రిటీల డ్రగ్స్ వ్యవహారాలు వెలుగు చూసింది. దాంతో ప్రధామిక విచారణలో తమకు అందిన వివరాల ప్రకారం ఎన్సీబీ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న అనేకమంతి తారలను ఇప్పటికే విచారించారు. మొత్తానికి ఏదో కేసును విచారణలో మొదలుపెడితే ఇంకేవో వివరాలు బయటపడుతున్నాయి. అర్జున్ విచారణ తర్వాత మరింతమంది సెలబ్రిటీలను విచారణకు పిలిపించే అవకాశాలున్నట్లు సమాచారం.
Tags:    

Similar News