బిబి4: మోనాల్ కష్టంకు ఫలితం దక్కింది
తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ కోసం నాల్గవ సీజన్ లో లవ్ ట్రాక్ నడిపించాలని ప్రయత్నించారు. అందుకోసం మోనాల్ ను వాడుకున్నారు. మోనాల్ తో బిగ్ బాస్ నిర్వాహకులు ముందస్తు ఒప్పందం చేసుకున్నారని.. స్క్రిప్ట్ ప్రకారం ఆమె అఖిల్ మరియు అభిజిత్ ల మద్య గొడవ పెట్టడం.. వారిద్దరికి క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించడం చేసింది అనేది చాలా మంది మాట. ఆమె వల్లే చాలా ఎపిసోడ్ లకు ఫుటేజ్ వచ్చింది. అందుకే ఆమెను ఏకంగా 14 వారాల పాటు కొనసాగించారు అనేది కొందరి వ్యాఖ్య. ఓట్లు రాకున్నా కూడా సేవ్ అయిన కంటెస్టెంట్ అంటూ మోనాల్ ను చాలా మంది విమర్శిస్తూనే ఉన్నారు. ఇన్ని విమర్శలు పడ్డా కూడా ఆమె కష్టంకు బిగ్ బాస్ వారు బాగానే ముట్టజెప్పారు అనేది టాక్.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికాలు సహజంగా అయితే బయటకు తెలియదు. వారు కూడా చెప్పకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది. కాని అనధికారికంగా మాత్రం తెలుస్తూ ఉంటాయి. మోనాల్ కు వారంకు మూడున్నర నుండి నాలుగు లక్షల పారితోషికం ఇచ్చి ఉంటారు అనేది సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే మోనాల్ కు యాబై నుండి అరవై లక్షల వరకు పారితోషికంగా వచ్చి ఉంటుంది అనేది సమాచారం. విజేత అయినా కూడా అంతకు మించి ఏమీ రావు. విజేత అయ్యి ఉంటే అది అదనపు అమౌంట్ అయినా కూడా ఆమెకు విజేత అయ్యే స్కోప్ లేదు. కాని ఆమె అఖిల్ తో పాటు అభిజిత్ తో చేసిన కెమిస్ట్రీకి పారితోషికం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో అభిజిత్ కు వారంలో మూడు లేదా మూడున్నర లక్షల వరకు పారితోషికం ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారు అందరికి కూడా వారంకు రెండు లక్షల లోపే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ లెక్కన చూసుకుంటే మోనాల్ కు చాలా బాగా బిగ్ బాస్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.