ఎన్టీఆర్ పెదనాన్న.. ఇంటిమేట్ ఫొటో

Update: 2016-04-28 10:01 GMT
దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. మలయాళంలోనే కాక తమిళం.. హిందీ భాషల్లోనూ గొప్ప గొప్ప పాత్రలు పోషించి అసాధారణమైన నటుడిగా గుర్తింపు సంపాదించాడు మోహన్ లాల్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’లో కీలక పాత్రతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ‘గాండీవం’ సినిమాలో కనిపించినా అది పాట వరకే. కాబట్టి ఎన్టీఆర్ మూవీనే ఆయనకు డెబ్యూ ఫిలింగా భావించాలి. ఇందులో ఎన్టీఆర్ పెదనాన్న పాత్రను పోషిస్తున్నాడు మోహన్ లాల్. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ లో పాల్గొంటున్న టైంలోనే మోహన్ లాల్ వివాహ వార్షికోత్సవం వచ్చింది. ఇందుకోసంషూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి వియత్నాం వెళ్లిపోయారీ సూపర్ స్టార్. తమ 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఓ ఇంటిమేట్.. మెస్మరైజింగ్ ఫొటో ఒక్కటి సోషల్ మీడియాలో షేర్ చేసింది సుచిత్ర మోహన్ లాల్. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు కాంప్లిమెంట్ ఇస్తూ.. మోహన్ లాల్ దంపతులకు వెడ్డింగ్ యానివర్శరీ విషెస్ చెబుతున్నారు అభిమానులు. మోహన్ లాల్-సుచిత్రలకు ప్రణవ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలున్నారు. కొన్నేళ్ల కిందట తండ్రి బాటలో నటనలోకి అడుగుపెట్టిన ప్రణవ్.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోవడం విశేషం.
Tags:    

Similar News