• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్ : ఒడియన్ భలే...

టీజర్ టాక్ : ఒడియన్ భలే ఉందే

By - Tupaki Desk
Update: 2017-12-15 07:24 GMT
మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఈమధ్య కాలంలో జనతా గ్యారేజ్.. మనమంతా సినిమాలతో టాలీవుడ్ లో కనిపించారు. ఆ తరవాత ఆయన నటించిన కనుపాప.. మన్యం పులి సినిమాలు తెలుగులోకి డబ్ అయి బాక్సాఫీస్ ను బాగానే ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడతారు అనేది తాజాగా నటించిన ఒడియన్ సినిమా అద్దం పడుతుంది.

మళయాళ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెతో తెరకెక్కుతున్న చిత్రం ఒడియన్. ఇందులో మోహన్ లాల్ మాణిక్కన్ ఒడియన్ గా కనిపించనున్నారు. ఒడియన్ అనేది ఓ కల్పిత జీవి. సగం మనిషి.. సగం జంతువు రూపంలో ఉండి అతీంద్రియ శక్తులున్న మనుషులు అడవుల్లో రాత్రివేళ సంచరించేవారన్నది కేరళలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్మకం. కేరళ జానపదాల్లో ఒడియన్ల పేరు బాగా వినిపిస్తుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కాలంలో జరిగిన సంఘటనలతో ఒడియన్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. నైట్ ఎఫెక్ట్ లో ఉన్న ఫొటో ప్రేమ్ లోకి ఉన్నట్టుండి మోహన్ లాల్ వచ్చి గంభీరంగా డైలాగులు చెప్పి వెళ్లిపోతారు. రొటీన్ గా ఉండే టీజర్ల కు డిఫరెంట్ గా సాగుతుంది. చివర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా అనిపిస్తుంది.

ఈ సినిమాలో యంగ్ ఒడియన్ గా కనిపించడం కోసం మోహన్ లాల్ 50 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గడం విశేషం. ఆయన కొత్తలుక్ చూసిన అభిమానులంతా ఆనాటి మోహన్ లాల్ ను చూసినట్టుందని తెగ ఖుషీ అయిపోతున్నారు. ఒడియన్ మూవీని వి.ఎ. శ్రీకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మంజు వారియర్.. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చిలో థియేటర్లకు వచ్చే అవకావశముంది.

Full View
Tags:    
  • Mohan Lal 
  • Odiyan Movie 
  • Odiyan Teaser 
  • TElugu news 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS