కంప్లీట్ యాక్టర్ మరి ఇలానా?

Update: 2017-12-16 12:00 GMT
కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన మోహన్ లాల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళం బాక్స్ ఆఫీస్ కు తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త పాటలను నేర్పే ఈ హీరో నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అయితే మోహన్ లాల్ కొంచెం చబ్బీ గా పెద్ద వయస్కుడిగా కనిపించినా కూడా ఆయన యాక్షన్ సీన్స్ ను కూడా చాలా బాగా చేస్తారు. డూప్ లేకుండా తనకు సంబందించిన సీన్స్ ని తానే చేసుకుంటారు.

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 57. అయితే ఈ వయసులో ఆయన లుక్ చాలా ఆకట్టుకుంటుంది. అయితే అయన చాలా రోజుల తర్వాత సరికొత్త లుక్ తో అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఒడియాన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆ సినిమా కోసం చాలా వెయిట్ తగ్గారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. అయితే అందులో ఉన్నది నిజంగా మోహన్ లాలేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

కానీ రీసెంట్ గా ప్ మొబైల్ కి సంబందించిన షాప్ ఓపెనింగ్ వెళ్లడంతో అందరు మరోసారి డైరెక్ట్ గా చూసి షాక్ అయ్యి నిజమని నమ్మారు. బరువు తగ్గాక ఎదో కొంచెం మార్పు వస్తుంది. కానీ కంప్లీట్ యాక్టర్ కంప్లీట్ గా మారిపోవడం చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తోంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియదు గాని మోహన్ లాల్ మాత్రం కెవ్వు కేక అని అంటున్నరు.  
Tags:    

Similar News