#ప్రభాస్ సాలార్.. లాల్ కి 20కోట్లు ఆఫ‌ర్ చేశారా?

Update: 2020-12-14 12:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో హీట్ పెంచిన సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టుల‌పై చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ -కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్  పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా `సాలార్` కొన్ని వారాల క్రితం ప్రకటించినప్పటి నుండి ప్ర‌ముఖంగా చర్చించబడిన ప్రాజెక్ట్ గా రికార్డుల‌కెక్కింది. ఈ చిత్రం తారాగణం సిబ్బందిపై మేకర్స్ ఇంకా అధికారిక‌ ప్రకటనలు చేయకపోయినా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సాలార్ బృందం సౌత్ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ ‌ను సంప్రదించార‌ని.. దాదాపు 20 కోట్ల పారితోషికం ఆఫ‌ర్ చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. సాలార్ లో ప్రభాస్ ఒక శక్తివంతమైన డాన్ కు కుడిభుజం పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. ఆ డాన్ పాత్ర కోస‌మే మోహన్ లాల్ ని సంప్ర‌దించార‌ని.. ఆ ఇద్దరు హీరోల్ని ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నార‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. ఇవ‌న్నీ ఇప్ప‌టికి ఊహాగానాలు మాత్ర‌మే. చిత్ర‌బృందం ప్ర‌తిదీ అధికారికంగా ఖాయం చేయాల్సి ఉంటుంది.

మోహ‌న్ లాల్ ఇంత‌కుముందు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌భాస్ కి ఓకే చెప్పారా లేదా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ స‌లార్ కి లాల్ యాడైతే ఆ మేర‌కు మ‌ల‌యాళంలో మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిన‌ట్టేన‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి.
Tags:    

Similar News