మోహన్ బాబు కల నెరవేరిందట

Update: 2016-02-01 07:50 GMT
తాను తన కొడుకు మనోజ్ ను ఓ తరహా పాత్రలో చూడాలని చాలా ఏళ్లుగా కలలు కంటున్నానని.. ‘శౌర్య’ సినిమాలో అతను అలాంటి పాత్రే చేశాడని అంటున్నాడు మోహన్ బాబు. మనోజ్, రెజీనా కసాండ్రా జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ‘శౌర్య’ సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మనోజ్ ఇప్పటిదాకా ఓ తరహా పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ పాత్రల్లో వైవిధ్యం చూపించాడు. ఐతే మనోజ్ ఇప్పటిదాకా చేసిన పాత్రలకు భిన్నంగా ఓ తరహా పాత్రలో చూడాలనుకున్నాను. నేను ఎలాంటి పాత్ర అయితే కోరుకున్నానో.. ‘శౌర్య’ సినిమాలో అలాంటి పాత్ర‌లోనే క‌నిపించి నా కల నెరవేరుస్తున్నాడు. దర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ మా ఫ్యామిలీ మెంబర్‌ తో స‌మానం. ఇంతకుముందు మా బేనర్లోనే మనోజ్ హీరోగా శ్రీ సినిమా చేశాడు. ఇప్పుడు ‘శౌర్య’ చేశాడు. ఈ చిత్రం అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను’’ అని మోహన్ బాబు అన్నారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ‘శౌర్య’ రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉండే కాన్సెప్ట్ బేస్డ్ ల‌వ్ స్టోరీ అని.. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతి కలిగిస్తుందని.. మ‌నోజ్ కార‌ణంగానే సినిమా చాలా బాగా వ‌చ్చిందని చెప్పాడు. మనోజ్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నింట్లోకి ఇందులో భిన్నంగా కనిపిస్తాడని అన్నాడు. శివ‌కుమార్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత‌ అని.. ‘శౌర్య’ సినిమాతో అతను మంచి మిత్రుడుగా మారిపోయాడని చెప్పాడు దశరథ్.
Tags:    

Similar News