మా స్కూల్లో చదివిన అమ్మాయి తమిళంలో స్టార్ హీరోయిన్: మోహన్ బాబు

Update: 2021-10-07 00:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇటీవల మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నారు. ఈ మధ్య మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఆయన కొన్ని విషయాలను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పర్సనల్ విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీ గురించి చెప్పారు. ముఖ్యంగా ఆయన స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి..

‘సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా ఉన్నాను. కానీ అందరూ నాకు స్నేహితులు కాలేదు. అయితే ఓ వ్యక్తితో నేను ఎంతో చనువుగా ఉన్నాను. కానీ ఈ మధ్య ఆయన ప్రవర్తనకు బాధ అనిపించింది. మా అబ్బాయి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి ఫోన్ చేసిన మరో వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరాడు. అయితే తన కుటుంబ సభ్యులు పోటీ చేసినా, తాను పోటీ చేసినా నిరభ్యంతరంగా తప్పుకునేవాళ్లం. కానీ వేరే వ్యక్తి కోసం అలా ఆరాటపడడం నచ్చలేదు. అయితే అతనితో నా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది.’

‘నేను పెట్టిన స్కూల్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ 25 శాతం మందికి ఉచితంగా విద్యనందిస్తున్నాం. ఓ సినిమా ఆర్టిస్టు చనిపోతే అతని కూతురు మా స్కూల్లోనే చదివించాం. ప్రస్తుతం ఆమె తమిళ సినీ పరిశ్రలో స్టార్ హీరోయిన్ అయింది. అయితే ఆమె పేరు గుర్తులేదు. ఇలా చాలా మంది గొప్ప వారయ్యారు. నేను గతంలో ఎన్నో చేద్దామనుకున్నాను. కానీ దేవుడు ఏదీ ఇవ్వాలో అదే ఇస్తాడు. వాస్తవానికి ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని నా కల. కానీ సినిమాల్లో ఉన్నంతకాలమే మనకు భవిష్యత్తు. ఇలా ప్రతీ దానికి డబ్బులు వృథా చేయకని రజనీకాంత్ చెప్పారు. దీంతో స్కూల్ పెట్టాను. ఎంతో మందికి విద్యనందిస్తున్నాను’

‘ఎన్టీఆర్ అన్నగారితో నాకెంతో అనుబంధం ఉంది. ఆయన బ్యానర్ సినిమాలో నేను విలన్ చేశారు. ఆ తరువాత అన్నగారి సహకారంతో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత నేను ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో నటించమని అడిగితే ఎందుకు నాతో సినిమా చేయిస్తావు..ఎవరు చూస్తారు నన్ను అని అన్నారు. కానీ మీలాంటి విలువైన మనిషి మళ్లీ దొరకరని అనడంతో వెంటనే చేసేశారు. ’

‘ఇక ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు నేనోసారి చంద్రబాబును కలిశాను. అప్పుడు ఆయన చాలా రోజులుగా పార్టీకి ప్రచారం చేస్తున్నారు. మీరు ఏమీ అడగట్లేదు. పెద్దాయన దగ్గరికెళ్లి ఓ మాట అడగండి.. అని అన్నారు. అయితే అన్నగారి దగ్గరికి వెళ్లి కొంచెం భయపడుతూ అడిగాను. దీంతో ఆయన నీకు రాజకీయాలంటే ఇష్టమా..? అని అన్నారు. ఆ తరువాత పెదరాయుడు షూటింగ్లో భాగంగా చెన్నైలో ఉండగా చంద్రబాబు ఫోన్ చేసి మీకు ఎంపీ సీటు ఓకే అయింది అని చెప్పారు. వెంటనే హైద్రాబాద్ కు రావాలని తెలపగా వచ్చి అన్నగారిని కలిశాను. ’

‘సినీ ఇండస్ట్రీలో కొందరు నిర్మాత చాలా గొప్ప వ్యక్తి. అయితే ఇప్పుడు కొందరు ఐకమత్యంగా ఉండడం లేదు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా డైరెక్టర్ చెబితేనే వ్యాన్లో వెళ్లేవారు. జూనియర్ ఆర్టిస్టులకు అసలు వ్యాన్లే లేవు. కానీ ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వ్యాన్ లేనిదే షూటింగ్ రావడం లేదు. పది మంది ఆర్టిస్టులు షూటింగ్లో ఉంటే 11 వ్యాన్లు పెడుతున్నారు. సినిమా నటులను క్రమశిక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై నేను పట్టుబడితే నన్ను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.’




Tags:    

Similar News