• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారసత్వం, కులాలపై మోహన్...

వారసత్వం, కులాలపై మోహన్ బాబు హాట్ కామెంట్స్

By - Tupaki Desk
Update: 2020-04-13 07:00 GMT
ఏదైనా ఉన్నది ఉన్నట్టు.. ముఖం మీదే చెప్పే విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఈయన ముక్కుసూటి తనం.. తీవ్రమైన క్రమశిక్షణ కారణంగా పలు వివాదాలు రాజుకున్నాయి. అయితే పంథా మార్చుకోని కలెక్షన్ కింగ్ ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కులాలుగా విడిపోయాయి. రాజ్యాధికారం సహా పెత్తనం అంతా ఆ రెండు మూడు కులాల చేతిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కులాలపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ..  ‘సమాజంలో ఇప్పుడు రెండే కులాలున్నాయి.  ఒకటి పాజిటివ్, రెండోది నెగెటివ్. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవాలి.. అప్పుడు జీవితాంతం గొప్పగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కరోనా వచ్చింది.మనకు గుణపాఠం నేర్పింది’ అంటూ హితబోధ చేశారు.

బాంబు వేస్తే ఏదో ఒకరోజు చచ్చిపోతాం.. కానీ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని కరోనా మహమ్మారితో ఎవరు చస్తారో తెలియని పరిస్థితి ఉందని మోహన్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందరినీ విడగొట్టే సత్తా కరోనాకు ఉందని.. ఇప్పటికైనా జనాలు మారాలని మోహన్ బాబు హెచ్చరించాడు.

అసలు వారసత్వం అనే పదమే లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఎవడికి కావాలి వారసత్వం అంటూ సంచలన కామెంట్ చేశాడు.  విష్ణు, మనోజ్, లక్ష్మీలు తన పిల్లలుగా ఉండాలని రాసి పెట్టి ఉందని.. వారసత్వం పనిచేయదని కుండబద్దలు కొట్టారు. మనోజ్ కు నటన అంటే ఇష్టమని.. విష్ణుకు బిజినెస్ అంటే మక్కువ అని.. లక్ష్మీ కూడా నటనలోనే కొనసాగాలని చూస్తోందన్నాడు.  ఎవడెక్కడ సక్సెస్ కావాలని రాసుంటే అక్కడికి వస్తాడని స్ఫష్టం చేశాడు.
Tags:    
  • Mohan Babu hot comments on castes 
  • Mohan Babu 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS