ఆమె పాత్ర అసభ్యంగా ఉండదట

Update: 2017-04-22 06:41 GMT
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో క్యూట్ రోల్స్ చేసి మెప్పించిన మిస్తీ చక్రవర్తి.. తొలిసారిగా అడల్ట్ కంటెంట్ మూవీలో నటిస్తోంది. బాబు బాగా బిజీ అంటూ బాలీవుడ్ మూవీ హంటర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో.. శ్రీనివాస్ అవసరాలకు జోడీగా నటిస్తోంది ఈ భామ. అయితే.. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి హీరోయిన్లు మరీ అశ్లీలంగా కనిపిస్తున్నారనే మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

తన పాత్ర అసభ్యంగా ఉండదని.. ఆడియన్స్ ను మెప్పించేలా ఉంటుందని అంటోంది మిస్తీ చక్రవర్తి. 'ఈ పాత్ర చేయడంపై మొదట చాలానే ఆలోచించాను. కానీ దర్శకుడు నవీన్ మేడారం నా రోల్ ను తీర్చిదిద్దిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకనే ఇష్టపడి మరీ ఈ కేరక్టర్ చేశాను. నేను చేసిన పాత్రలో ఎలాంటి అశ్లీలత ఉండదు. ఓ మెసేజ్ ఉంటుందంతే' అని చెప్పిన మిస్తీ చక్రవర్తి.. ఈ సినిమాను తాను ఎవరిపైనా ఆధారపడని ఓ మెచ్యూర్డ్ ఉమన్ రోల్ చేస్తున్నట్లు చెప్పింది. తన రియల్ లైఫ్ కి ఇది పూర్తిగా విభిన్నం అనేసింది మిస్తీ.

'కేరక్టర్స్ తో ప్రయోగాలు చేయడం.. వైవిధ్యం చూపించడం నాకు ఇష్టం. బాబు బాగా బిజీ కూడా ఇలాంటిదే. మరో చిత్రం శరభ షూటింగ్ కూడా పూర్తి చేసేశాను. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉండి.. బాగా యాటిట్యూడ్ చూపించే అమ్మాయిగా నటించాను. ఇది సైంటిఫిక్ మూవీ కావడంతో.. గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి' అంటోంది మిస్తీ చక్రవర్తి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News