టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మీర్జాపూర్ బీనా ఆంటీ

Update: 2021-04-24 05:34 GMT
ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకునేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవ‌ల ఓటీటీ- డిజిట‌ల్ రాక‌తో ప్ర‌తిభ ఏ మూల ఉన్నా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు సులువుగా మారాయి. పొరుగు ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టుల‌కు ఇది ఒక వ‌రం అనే చెప్పాలి.

త్వర‌లోనే ఓటీటీ ప్ర‌భంజ‌నంలో స‌త్తా చాటిన ప్ర‌ముఖ హిందీ న‌టి ర‌సీకా దుగ్గ‌ల్ తెలుగు సినీప‌రిశ్ర‌మలో అడుగుపెట్ట‌నున్నార‌ని స‌మాచారం. వాస్త‌వానికి రసికా దుగ్గ‌ల్ అంటే ఇక్క‌డ  ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌రు. బీనా ఆంటీ అంటే మాత్రం వెంట‌నే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేస్తుంది. మీర్జాపూర్ 1.. 2 సీజ‌న్ల‌ లో గొప్ప ఆస‌క్తిక‌ర‌ పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించిన దుగ్గ‌ల్ .. త‌న‌దైన న‌ట‌న‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించారు.

ఇప్పుడు ఈ క్రేజ్ ని తెలుగులో కూడా క్యాష్ చేసుకునేందుకు స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. వాస్త‌వానికి నార్త్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఇప్పుడు సౌత్ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌తిభాంతురాలైన ర‌సీకా దుగ్గ‌ల్ కి భారీ పారితోషికం ఇచ్చి అయినా తెలుగులో స‌రైన స్టోరీతో లాంచ్ చేయాల‌ని ప‌లువురు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లి కాలంలో అంత‌టి పాపులారిటీ వేరొక న‌టికి ద‌క్క‌లేద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. మీర్జాపూర్ సీజ‌న్ 2లో ఔట్ ఆఫ్ ల‌వ్ కాన్సెప్ట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని అదే సిరీస్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లింద‌ని ర‌సికా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్య‌క్తం చేసారు.
Tags:    

Similar News