• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీటూ : బిగ్‌ బి పై కూడా...

మీటూ : బిగ్‌ బి పై కూడా పిడుగు పడనుందా?

By - Tupaki Desk
Update: 2018-10-13 18:50 GMT
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నానా పటేకర్‌ పై తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసిన తర్వాత అదే దారిలో పలువురు తమకు ఎదురైన లైంగిక దాడిని మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చెప్పుకోలేకుండా ఉన్న విషయాలను ఇప్పుడు ఎంతో మంది మహిళలు, బాలీవుడ్‌ ఫీమెయిల్‌ సెలబ్రెటీలు మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. తనూశ్రీ దత్తాకు మద్దతు పలుకుతూనే పలువురు మీటూ అంటూ తమకు ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పెద్ద మనుషుల బండారాలు బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో అమితాబ్‌ గురించి కూడా ఏదైనా షాకింగ్‌ విషయం వినాల్సి వస్తుందా అనే ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది.

తనూశ్రీ దత్తా విషయంలో బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు స్పందించారు. కాని అమితాబ్‌ స్పందించలేదు అంటూ కొందరు విమర్శలు చేశారు. తనూశ్రీ దత్తా కూడా తన విషయంలో బిగ్‌ బి స్పందించక పోవడంతో ఒకింత అసహనం వ్యక్తం చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమితాబ్‌ సోషల్‌ మీడియా ద్వారా మీటూ ఉద్యమానికి మద్దతు పలికాడు. ఆడవారు పని చేసే ప్లేస్‌ లో భద్రత తప్పనిసరిగా ఉండాలని, అలా లేకుంటే దేశానికే మచ్చ అంటూ పోస్ట్‌ చేశాడు. అమితాబ్‌ పోస్ట్‌ కు ప్రముఖ హెయిర్‌ స్టైలిష్ట్‌ సప్నా మోతీ భవ్నానీ విభిన్నంగా స్పందించారు.

ఆమె అమితాబ్‌ ట్వీట్‌ కు సమాధానంగా.. మీరు మాట్లాడినది పెద్ద అబద్దం, మీ పింక్‌ సినిమా వచ్చి పోయింది, దాంతో మీకున్న సామాజిక వేత్త అనే మంచి పేరు కూడా పోయింది. మీ గురించిన నిజాలు త్వరలో బయటకు వస్తాయి. నా ఈ ట్వీట్‌ చూస్తూ మీరు గోళ్లు కొరుకుతూ ఉంటారు. అయితే ముందు ముందు మీరు కొరుక్కునేందుకు గోళ్లు కూడా ఉండవు అంటూ పోస్ట్‌ చేసింది. సప్నా ట్వీట్‌ తో బాలీవుడ్‌ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అమితాబ్‌ గురించి ఏ సమయంలో ఎలాంటి పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బిగ్‌ బి అభిమానులు సప్నా ను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు.
Tags:    
  • #MeToo movement 
  • Sapna Bhavnani 
  • Amitabh Bachchan 
  • Telugu News 

Similar News

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

Copyright @2026

Powered by Blink CMS