జిమ్ బాట పట్టాల్సిందే!!

Update: 2017-11-03 06:15 GMT
వరుస సక్సెస్ లు ఎవరికైనా మంచి జోష్ ను ఇస్తాయి. పైగా తొలి సినిమా నుంచి అన్నీ విజయాలు మాత్రమే దక్కించుకోవడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఇప్పుడు ఇలాంటి ఆనందాన్నే ఎంజాయ్ చేస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాధతో పరిచయం అయ్యి.. ఆ తర్వాత మహానుభావుడు.. రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె టైమ్ బాగానే నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న కేరాఫ్ సూర్య మూవీలో కూడా మెహ్రీన్ హీరోయిన్. ఆ తర్వాత జస్ట్ మూడు వారాల గ్యాప్ లో సాయిధరం తేజ్ జవాన్ మూవీ విడుదల కానుండగా.. ఇందులో కూడా ఈమే నటించింది. అంటే జస్ట్ రెండున్నర నెలల సమయంలో దాదాపు 4 సినిమాలు విడుదల అవుతుండగా.. జవాన్ మూవీలో ఈమె గ్లామర్ యాంగిల్ ను కూడా చూపించేసిందనే సంగతి.. రీసెంట్ గా విడుదల చేసిన బుగ్గంచున సాంగ్ ప్రోమోను చూస్తే అర్ధమవుతుంది.

ఇప్పటివరకూ హోమ్లీ క్యారక్టర్స్ తో అలరించిన మెహ్రీన్ కౌర్.. ఇప్పుడు గ్లామర్ అంటే డిఫరెంట్ గానే ఉంటుంది. కానీ ఈ భామ బొద్దుగా ఉందనే విషయం ఈ గ్లామర్ యాంగిల్ లో తెలిసిపోతోంది. గ్లామర్ డాల్ ఇమేజ్ కోరుకుంటున్నపుడు.. ఆ జోనర్ లో కూడా కమర్షియల్ గా వర్కవుట్ కావాలంటే.. ఈ భామ జిమ్ లో తెగ కసరత్తులు చేయక తప్పేట్లుగా లేదు. అయితే.. అందం కాపాడుకోవడానికి అందాల భామలు ఎంత కష్టమైనా పడతారనే సంగతి తెలిసిందే కదా.
Tags:    

Similar News