భారీ సినిమాల డైరెక్టర్ ఏమయ్యాడు?
కంత్రి సినిమాకు ఓ ముప్ఫై కోట్లు.. బిల్లా సినిమాకు ఇంకో ముప్ఫై.. కంత్రి సినిమాకు యాభై కోట్లు.. షాడో సినిమాకు ఇంకో ముప్ఫై.. మొత్తం కలిపితే నాలుగు సినిమాలకు ఓ 140-150 కోట్ల దాకా ఖర్చు పెట్టించిన ఘనుడు మెహర్ రమేష్. కానీ రిటర్న్ లో ఎంత వెనక్కి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నంతలో ‘బిల్లా’ సినిమాకు పెట్టుబడి పెట్టిన కృష్ణంరాజు కొంచెం సేఫ్ అయ్యాడు. అశ్వనీదత్ కు ఒకటికి రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా శక్తి దెబ్బకు సినిమాలే ఆపేశాడు పెద్దాయన. ‘షాడో’తో పరుచూరి కిరీటి పరిస్థితి కూడా కిందా మీదా అయింది. మొత్తానికి చేసింది నాలుగు సినిమాలే అయినా కావాల్సినంత చెడ్డపేరు సంపాదించాడు మెహర్. బ్యాగ్రౌండ్ గట్టిగా ఉండటంతో మళ్లీ మళ్లీ భారీ అవకాశాలే దక్కాయి కానీ.. ‘షాడో’ తర్వాత మాత్రం ఎవ్వరూ అతడి జోలికి వెళ్లలేదు.
రెండేళ్ల నుంచి తర్వాతి సినిమా మొదలు పెడదామని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు కానీ.. వర్కవుట్ కావడం లేదు. హిట్లు ఫ్లాపులు చూడకుండా డైరెక్టర్లకు అవకాశమిచ్చే రవితేజ సైతం.. ‘షాడో’ ఫలితం చూశాక మెహర్ తో పెట్టుకోవడానికి సాహసించలేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘పవర్’ పేరుతో అనుకున్న సినిమా పట్టాలెక్కలేదు. ఆ టైటిల్ తో తర్వాత మాస్ రాజా వేరే సినిమా చేసుకున్నాడు. రవితేజ హ్యాండ్ ఇచ్చాక చాలామంది హీరోలు, నిర్మాతల్ని కలిసినా మెహర్ కు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీంతో ప్రయత్నాలు మానుకుని కొన్ని రోజులుగా సైలెంటుగా ఉన్నాడు మెహర్. ప్రస్తుతానికి కొత్త కథలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు కానీ.. అతడికి తర్వాతి అవకాశం ఇచ్చేదెవరన్నదే సందేహం.