మెహర్ రమేష్.. ఈ కొత్త పాత్ర ఏంటి?

Update: 2018-09-02 01:30 GMT
మెహర్ రమేష్ తీసిన సినిమాలు మూడే. కానీ అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ ముద్ర ఎలాంటిదని ఏ తెలుగు ప్రేక్షకుడినడిగినా ఇట్టే చెప్పేస్తాడు. ‘కంత్రి’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఈ పూరి జగన్నాథ్ శిష్యుడు.. రీమేక్ మూవీ అయిన ‘బిల్లా’తో యావరేజ్ మార్కులేయించుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ‘శక్తి’.. ‘షాడో’ లాంటి ఆల్ టైం డిజాస్టర్లు అందించాడు. అసలు విషయం వదిలేసి హంగుల మీద దృష్టి పెట్టడం ద్వారా బడ్జెట్లను కొండెక్కించేస్తాడని మెహర్ కు చాలా చెడ్డ పేరే ఉంది. ‘శక్తి’ లాంటి చెత్త సినిమా తర్వాత కూడా ఏమాత్రం మేలుకోకుండా ‘షాడో’తో ఇంకో డిజాస్టర్ ఇచ్చాడు. దెబ్బకు మళ్లీ అతడికి సినిమా ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాగని మెహర్ ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోలేదు.

టాలీవుడ్ పెద్ద ఫ్యామిలీస్ కు అతడికి మంచి సంబంధాలున్నాయి. తరచుగా ఏదో ఒక కార్యక్రమంలో అతను దర్శనమిస్తుంటాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు అతను చాలా క్లోజ్. మహేష్ కు సంబంధించిన బ్రాండ్లను అతను మేనేజ్ చేస్తాడని అంటారు. అతడితో కొన్ని కమర్షియల్స్ కూడా చేశాడు మెహర్. మరోవైపు పవన్ మిత్రుడైన రమేష్ తాళ్ళూరితో అతడికి మంచి సంబంధాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బంధువు కావడంతో అల్లు ఫ్యామిలీతోనూ అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంకా చాలామందితో టచ్ లో ఉంటుంటాడు మెహర్. ఈ పరిచయాలతో కాంబినేషన్లు.. సినిమాలు సెట్ చేసే మీడియేటింగ్ వ్యవహారాల్లో మెహర్ బాగా బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే సంపత్ నంది ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘పేపర్ బాయ్’ని అల్లు అరవింద్ చేతికి వెళ్లేలా చేశాడు. జడ్జిమెంట్ స్కిల్స్ లో తిరుగులేదని పేరున్న అరవింద్.. మెహర్ మధ్యవర్తిత్వంతోనే ‘పేపర్ బాయ్’ని తీసుకున్నాడు. కానీ ఆ సినిమా ఆయన టేస్టుపై సందేహాలు వచ్చేలా చేసింది. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. అరవింద్ చెప్పినంత సీన్ సినిమాకు లేదని తేలిపోయింది. ఇప్పుడు అందరి వేళ్లూ మెహర్ వైపే చూపిస్తున్నాయి. దర్శకుడిగా కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నమెహర్.. ఇప్పుడు ఇలాంటి డీల్స్ తోనూ నెగెటివ్ అయిపోతున్నాడు.

Tags:    

Similar News