చిరంజీవి మళ్లీ వచ్చాడు. మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్
ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా ఇటీవలే గుండెపోటుతో మరణించడం శాండిల్ వుడ్ లో తీవ్ర విషాదం నింపింది. 36 ఏళ్ల వయసులోనే చిరంజీవి ఆకస్మిక మరణం కలిచివేసింది. అకాల మరణం చెందినప్పుడు ఆయన భార్య మేఘానా రాజ్ నిండు గర్భిణి. దీంతో భర్త లేని లోటు ఆమెను కృంగదీసింది.
చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో ఇటీవలే ఆమెకు సీమంతం కూడా చేశారు. ఆ ఫొటోలు ఆయన అభిమానులను, నెటిజన్లను కన్నీళ్ల పర్యంతం చేశాయి.
తాజాగా చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ అన్నయ్యే మళ్లీ పుడుతాడు అంటూ చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా భావోద్వేగంతో అన్న మాట నిజమైంది.
చిరంజీవి చనిపోయినా ఆయన కుటుంబ సభ్యులు మేఘనను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈరోజు మేఘనకు మగ బిడ్డ పుట్టాడు. విశేషం ఏంటంటే ఇదే రోజు చిరంజీవి-మేఘనల ఎంగేజ్ మెంట్ డే అని తెలుస్తోంది.