పాత సినిమాకే ప్రేక్ష‌కుల‌ ఓటు

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మూడు కొత్త చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. వాటిలో ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన బ్యాడ్ బాయ్ కార్తీక్ ఫ‌లితం ఏంటో మార్నింగ్ షోల‌తోనే తేలిపోయింది.;

Update: 2026-04-19 09:38 GMT

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మూడు కొత్త చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాయి. వాటిలో ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన బ్యాడ్ బాయ్ కార్తీక్ ఫ‌లితం ఏంటో మార్నింగ్ షోల‌తోనే తేలిపోయింది. నాగ‌శౌర్య లాంటి పేరున్న హీరో ఉన్న‌ప్ప‌టికీ.. ఈ చిత్రాన్ని ఆడియ‌న్స్ క‌నీస స్థాయిలోనూ ప‌ట్టించుకోలేదు. ఈ సినిమాకు ఇచ్చిన షోలే ప‌రిమితం. వాటిలో కూడా చాలా వ‌ర‌కు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. రివ్యూలు, టాక్ బ‌య‌టికి వ‌చ్చాక పూర్తిగా జ‌నం ఈ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టేశారు. ఈ వీకెండ్ రేసులో నిలిచిన చిన్న సినిమాలు తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ, పాపం ప్ర‌తాప్ చిత్రాల‌కు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చింది.

కానీ ఇవి కూడా ప్రేక్ష‌కుల‌ను సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయాయి. వీటికి బుకింగ్స్, క‌లెక్ష‌న్స్ ప‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉన్నాయి. శ‌నివారం సాయంత్రం ఈ చిత్రాల‌కు ఒక మోస్త‌రుగా ఆక్యుపెన్సీలు క‌నిపించాయి. వీకెండ్ త‌ర్వాత ఈ సినిమాలు నిల‌బ‌డ్డ‌మే క‌ష్టమే అన్న‌ట్లుంది ప‌రిస్థితి.

ఐతే ఈ వారం వ‌చ్చిన కొత్త సినిమాల‌తో పోలిస్తే.. ముందు వారం రిలీజైన డెకాయిట్ సినిమా ప‌రిస్థితే మెరుగ్గా ఉంది. తొలి వీకెండ్లో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన శేష్ సినిమా.. వీక్ డేస్‌లో కొంచెం వీక్ అయింది. కానీ వీకెండ్ వ‌చ్చేస‌రికి సినిమా మ‌ళ్లీ పుంజుకుంది. ఈ వీక్ సినిమాలు ఏవీ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోక‌పోవ‌డం, వాటిలో స్టార్ ప‌వ‌ర్ లేక‌పోవ‌డం డెకాయిట్‌కు బాగా క‌లిసొచ్చింది. బాక్సాఫీస్ లీడ‌ర్ బోర్డ్‌లో ఈ చిత్ర‌మే టాప్‌లో నిలుస్తోంది.

శ‌నివారం ఈవెనింగ్, నైట్ షోలకు డెకాయిట్‌కు మ‌ల్టీప్లెక్సుల్లో ఫుల్స్ ప‌డ్డాయి. ఆదివారానికి కూడా బుకింగ్స్ ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. ఫ‌స్ట్, సెకండ్ షోల‌కు మంచి ఆక్యుపెన్సీల‌తో న‌డిచేలా ఉందీ సినిమా. శేష్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ సినిమాకు టాక్ అంత గొప్ప టాక్ రాలేదు. అయినా ఈ సినిమాకు మంచి వ‌సూళ్లే రాబ‌డుతోంది. ఇప్ప‌టికే రూ.50 కోట్ల వ‌సూళ్ల మార్కును దాటేసింది డెకాయిట్. బ‌య్య‌ర్ల‌కు ఫుల్ ర‌న్లో మంచి లాభాలే వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News