• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందమైన అబద్దాన్ని పరిచయం...

అందమైన అబద్దాన్ని పరిచయం చేశారుగా

By - Tupaki Desk
Update: 2017-06-10 04:32 GMT
నయనతార.. నిత్యా మీనన్.. అమలా పాల్.. నివేదా థామస్.. అనుపమా పరమేశ్వరన్.. అను ఎమ్మానుయేల్.. వీళ్లందరూ మల్లూ కుట్టీలైతే.. త్రిష.. సమంత.. మొదలు స్టారీమణులు అందరూ కూడా తమిళ సుందరాంగులు. ఎప్పుడూ టాలీవుడ్ లో బొంబాయి భామలకంటే వీరి హడావుడే ఓ రకంగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కేటగిరీలోకి మరో అందమైన అబద్దం కూడా వస్తోంది.

నితిన్ హీరోగా 'లై' సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అంతా అమెరికాలోనే జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక అందమైన ప్రేమను.. 'లై'లో ఉన్న ఆ ప్రేమను పరిచయం చేస్తున్నాం అంటూ హీరోయిన్ ముఖం కనిపించకుండా ఒక పోస్టర్ ను మొన్ననే రిలీజ్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ హీరోయిన్ ను కూడా పరిచయం చేశారు. ఆ అందమైన అబద్దం పేరే మేఘా ఆకాష్. ఈ 21 ఏళ్ళ తమిళ సుందరి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఓనమాలు దిద్దుకుంటుంది. వచ్చీ రావడమే తమిళంలో రెండు సినిమాలు.. తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసింది. ఆ విధంగా నితిన్ 'లై' ద్వారా తొలిసారి ఈ యంగ్ హాటీని తెలుగువారు చూస్తున్నారు.

ఇకపోతే హను రాఘవపూడి గత సినిమాల ద్వారా పరిచయమైన హీరోయిన్లు అందరూ కూడా సినిమాలు యావరేజిగా ఆడినా ఫ్లాపైనా కూడా బాగానే పేరు సంపాదించారు. అందాల రాక్షసితో వచ్చిన లావణ్య త్రిపాఠి.. కృష్ణగాడి వీర ప్రేమగాధతో పరిచయమైన మెహ్రీన్ కౌర పీర్జాదా.. ఇద్దరూ కూడా ఒక్క సినిమాకే పాపులర్ అయిపోయి బిజీ అయిపోయారు కూడా. ఇప్పుడు మేఘా ఆకాష్ కూడా అదే బాటలో వెళ్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Megha Akash 
  • Nithin 
  • LIE Movie 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS