• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అత్తారింటికి దారేది...

అత్తారింటికి దారేది రీమేక్‌ లో మేఘ‌

By - Tupaki Desk
Update: 2018-09-04 04:43 GMT
యువ‌క‌థానాయిక మేఘా ఆకాష్ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? వ‌రుస‌గా రెండు ఫ్లాపుల్లో న‌టించిన ఈ అమ్మ‌డి కెరీర్ ఇక క్లోజ్ అయిన‌ట్టేనా? అందానికి అందం .. క్యూట్ లుక్స్‌ తో ఆక‌ట్టుకున్న ఈ టీనేజీ గాళ్ రేసులో ఉందా .. లేదా? ..  అంటే డీటెయిల్స్‌ లోకి వెళ్లాల్సిందే.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ స‌ర‌స‌న వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించింది మేఘ ఆకాష్‌. క్యూట్ చ‌బ్బీ గాళ్ తెలుగు కుర్రకారుకు పిచ్చిగా న‌చ్చేసింది. లై - చ‌ల్ మోహ‌న్ రంగ చిత్రాల్లో ఆక‌ట్టుకునే అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్. మొత్తానికి ఆ ప్ర‌భావం ఈ క్యూట్ గాళ్ కెరీర్‌ పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌నే చెప్పాలి. టాలీవుడ్ కెరీర్ ఇలా ఉంటే మ‌రోవైపు కోలీవుడ్ లోనూ అంతే నెగెటివ్ రిపోర్ట్ మేఘ‌ ను ఇబ్బంది పెడుతోంది. ఈ భామ న‌టిస్తున్న రెండు త‌మిళ చిత్రాలు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూనే ఉన్నాయి. అవేవీ పూర్త‌వ్వ‌వు.. రిలీజ్‌ కి రావు.. అన్న చందంగా అయిపోయింది. దీంతో పాపం ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మేఘ కెరీర్ రేస్‌ లో వెన‌క‌బ‌డింది. చెప్పుకోవ‌డానికి ఈ ఒక్క ఏడాదిలోనే మూడు సినిమాల‌కు సంత‌కాలు చేసింది. అవి మూడూ త‌మిళ చిత్రాలే. కానీ ఏదీ రిలీజ్‌ కి రావ‌డం లేదు.

ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అధ‌ర్వ స‌ర‌స‌న `బూమ‌రాంగ్‌` అనే భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ లో న‌టిస్తోంది. క‌న్న‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై మేఘ చాలానే ఆశ‌లు పెట్టుకుందిట‌. ఇది సెట్స్‌ పై ఉండ‌గానే మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ అందుకుంది. టాలీవుడ్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ `అత్తారింటికి దారేది` త‌మిళ రీమేక్‌ లో మేఘ ఛాన్స్ కొట్టేసింది. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ - స‌మంత‌- ప్ర‌ణీత నాయకానాయిక‌లుగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన `అత్తారింటికి దారేది` చిత్రాన్ని సుంద‌ర్ సి త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈనెల‌లోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఇందులో మేఘ‌ కు ఏ పాత్ర‌లో అవ‌కాశం వ‌చ్చిందో తెలీదు కానీ, ఛాన్స్ అయితే ద‌క్కించుకుంది. త‌మిళ చిత్రాలు ఎన్నై నోకి పాయుమ్‌ - ఒరు ప‌క్కా క‌థాయ్ చిత్రాలు రిలీజ్‌ కి రావాల్సి ఉంది.
Tags:    
  • Megha Akash 
  • Attarintiki Daredi Tamil Remake 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS