మెగాస్టార్ ఆచార్య అదరగొట్టాడు

Update: 2022-04-04 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు.

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది. మరో హీరోయిన్ పూజా హెగ్డే కీలక పాత్ర పోషించింది.  మణిశర్మ సంగీతం అందించగా... కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మించాయి. అయితే తరచూ రిలీజ్ డేట్ బయటకొచ్చాక వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది.

అయితే ఇందుకు సంబంధించిన సినిమా ట్రైలర్ కాని ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. అయితే ఇంకో మూడు వారాల్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమాకు సంబంధించిన పలు విషయాలను నిర్మాత అన్వేష్ రెడ్డి బయట పెట్టారు. సినిమా ట్రైలర్ ను సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందు మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే రిలీజ్ కు వారం రోజుల ముందు గ్రాండ్ గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంటన్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

 అయితే  ఆచార్య సినిమా థియేట్రికల్ రైట్స్ అమెరికాకు 2.6 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. అయితే ఈ లక్ష్యాన్ని ఆచార్య సినిమా సులువుగా చేదింగచగలగది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మెగాస్టార్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ లక్ష్యాన్ని చేధించాలంటే.. మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకోవాలి. అప్పుడే అభిమానులంతా థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను చూస్తారు. అప్పుడే బాక్సాపీసు వద్ద భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవచ్చు.

బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత థియేటర్ కి రాబోతున్న రామ్ చరణ్ సినిమా ఇదే కావడం ఆచార్య సినిమాకు ప్లస్ పాయింట్ కాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి టాక్ ను అందుకుంటుంది ఏ రేంజ్ లో బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతుందో తెలుసుకోవాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
Tags:    

Similar News