ఆ రాత్రి మెగాస్టార్ 3 గంటలే నిద్రపోయారు!
మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతటి అంకిత భావం..కష్టపపడే తత్వం గల నటుడు కాబట్టే 150 సినిమాలు సునాయాసంగా చేయగలిగారు. సినిమాల పట్ల తనకున్న ఫ్యాషన్... ఇష్టం..అభిమానం ఆయన్ని ఎప్పుడు అలసి పోనివ్వలేదు. షూటింగ్ ఉందంటే డే అండ్ నైట్ తేడా లేకుండా పనిచేస్తారు. పెర్పార్మెన్స్ లో ది బెస్ట్ ఇచ్చే వరకూ ప్రయత్నిస్తునే ఉంటారు. అందుకే మెగాస్టార్ దర్శకుల హీరో అయ్యారు.
నేటి తరం హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. కాదుకాదు అంతకు మించి చిరు సినిమాలు చేస్తున్నారు. ఒకే ఏడాది ఏకంగా చిరు మూడు సినిమాలు సెట్స్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 60 ప్లస్ లో చిరంజీవి నేటి హీరోలని మించి సినిమాలు చేస్తున్నారు అన్నది వాస్తవం. చిరంజీవిలో కష్టపడే తత్వం చిన్న నాటి నుంచే ఉంది. ఆయన లో ఆ గుణం చూసే చిరంజీవి సక్సెస్ ని ముందే అంచనా వేసి అల్లు రామలింగయ్య ఇంట అల్లుడ్ని చేసుకున్నారు.
తాజాగా చిరంజీవి డెడికేషన్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ``చిరంజీవి గారు ఇప్పుడు ఏకంగా మూడు సినిమా షూటింగ్ లు చేస్తున్నారు. సాధారణంగా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ షూటింగ్ చేయడమే కష్టం. ప్రస్తుతం హీరోల టైమింగ్ అదే. ఆ టైమ్ లోనే చాలా అలసిపోతాం. ఇంటికొచ్చే సరికి టైడ్ అయిపోతాం.
చాలా అన్ ఈజీగా అనిపిస్తుంది. కానీ పెదనాన్న రెండు వారాల క్రితం ఒకే రోజులో మూడు సినిమా షూటింగ్ లకు హాజరయ్యారు. ఒక సినిమా షూటింగ్ పూర్తిచేసి వచ్చి గంట విశ్రాంతి తీసుకుని అనంతరం హైదరాబాద్ విమానంలో తిరిగొచ్చారు. ఇంట్లో భోజనం చేసి మరో షూటింగ్ కి బయల్దేరారు. ఆ రోజు కేవలం అతను మూడు గంటలే నిద్రపోయారు.
అంత కష్టపడాల్సిన అవసరం అతనికి లేదు. కానీ ఇప్పటికీ చిరంజీవిగారు అలాగే కష్ట పడుతున్నారు. ఆ విధంగా నాకు చిరంజీవి గారు ఎంతోస్ఫూర్తి` అని అన్నారు. పాత తరం హీరోలు ఒకేరోజులో నాలుగైదు సినిమా షూటింగ్ ల్లో పాల్గొనేవారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఇంకా ఏఎన్నార్..ఎన్టీఆర్ లాంటి లెజెండరీ నటుల టైమింగ్ విధానం..సినిమా షూటింగ్ లకు హాజరవ్వడం అలాగే ఉండేది.
మలయాళ నటుడు మోహన్ లాల్ ఏడాదికి ఆరు సినిమాల్లో నటించి రిలీజ్ చేస్తారు. ఇప్పటి హీరోలకు ఏడాదిక ఒక సినిమా చేసి రిలీజ్ చేయడమే కష్టమైపోయింది. కానీ చిరంజీవి 60 ఏళ్ల వయసుల్లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా శ్రమిస్తున్నారు.