కోవిడ్ ఎఫెక్ట్: బాక్సాఫీస్ బరిలో మెగా vs అల్లు..?
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన వారందరూ తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసి, తదుపరి విడుదల తేదీల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడగా.. లేటెస్టుగా మే 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'ఆచార్య' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమాని కోవిడ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. ఆగస్ట్ నాటికి పరిస్థితులు చక్కబడితే 'ఆచార్య' ను ఆగస్ట్ 13న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే చెప్పిన డేట్ కే తీసుకురావాలని చూస్తున్నారు. ఒకవేళ 'ఆచార్య' కూడా అప్పుడే రావాలని అనుకుంటే మాత్రం బాక్సాఫీస్ బరిలో మామా అల్లుళ్లు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. కాకపోతే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు ఒకే రోజు రావడానికి ఇష్టపడతారని భావించలేం. కానీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న 'పుష్ప' అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేయాల్సి ఉంటుంది. వాయిదా వేయాలంటే వేరే భాషల్లో కూడా సరైన డేట్ దొరకడం కష్టం. పోనీ 'ఆచార్య' ను ఇంకాస్త ముందుకు జరుపుతారు అనుకుంటే సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. 'పుష్ప' రిలీజైన తర్వాత విడుదల చేయడానికి అదే ఫ్యామిలీ హీరోలు నటించిన 'ఎఫ్ 3' - 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి - బన్నీ సినిమాల మధ్య పోటీ అనివార్యం అవుతుందా లేదా రెండు వారాల గ్యాప్ లో సినిమాలను విడుదల చేసుకుంటారా అనేది చూడాలి.