• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాంచరణ్ కు 'జపాన్'...

రాంచరణ్ కు 'జపాన్' అభిమానుల 'మెగా' ట్రీట్..!

By - Tupaki Desk
Update: 2022-10-21 12:30 GMT
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' విదేశాల్లో సత్తా చాటబోతుంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అంతే స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు జపాన్లోనూ 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా 'ఆర్ఆర్ఆర్' టీం జపాన్ కి వెళ్లిన సంగతి తెల్సిందే.

రాంచరణ్ కు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఇండియన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే జపానీయులు మన స్టార్ హీరోలను అనుకరిస్తూ ఉంటారు.

తమిళ సూపర్ స్టార్ రజనీ తర్వాత ఆ స్థాయిలో రాంచరణ్, ఎన్టీఆర్ లకు క్రేజ్ ఉంది. దీంతో రాంచరణ్ నటించిన చిత్రాలు సైతం అక్కడి భాషలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి.

ఇండియాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్'ను జపాన్ భాషలోనూ విడుదలవుతోంది.  ఈక్రమంలోనే  'ఆర్ఆర్ఆర్' బృందం జపాన్లో ప్రమోషన్ చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాంచరణ్, ఉపాసన దంపతులకు అక్కడి వారి నుంచి విశేష స్పందన లభిస్తోంది.

జపాన్ రాజధాని టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ను రాంచరణ్, ఉపాసన సందర్శించారు. అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాంచరణ్, ఉపాసన దంపతులకు జపాన్ విద్యార్థులు వారి పెంపుడు జంతువు రైమ్ ను పోలిన కొన్ని బొమ్మలను బహుమతులుగా ఇచ్చారు. తమపై ఎంతో ప్రేమనురాగాలను కనబర్చిన విద్యార్థులతో రాంచరణ్ దంపతులకు సెల్పీలుగా దిగడంతోపాటు చాలాసేపు అక్కడే గడిపారు.

ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' టీంతో కలిసి విద్యార్థులు థియేటర్లో సినిమా చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RamCharan 
  • MegaPowerStar 
  • MegaFamily 
  • RRR 
  • Japan 
  • Promotion 
  • Rajamouli 
  • NTR 
  • Upasana 
  • Tollywood 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS