మెగా అమ్మాయిలు.. పాస్ ది బ్రష్ ఛాలెంజ్

Update: 2020-04-23 14:06 GMT
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏదో ఒక ఛాలెంజ్. అన్నీ ఛాలెంజులే. చిన్నా పెద్దా లేకుండా ఈ ఛాలెంజిలతో అందరినీ ఆకర్షిస్తున్నారు. బీ ది రియల్ మ్యాన్ పేరుతో పురుష పుంగవులు మహిళల పనిని బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారికేమీ పని లేకుండాపోతోంది. అందుకే మేకప్ బ్రష్ ఛాలెంజ్ మొదలు పెట్టారు. దీన్నే పాస్ ది బ్రష్ ఛాలెంజ్ అని కూడా అంటారు. ఈ ఛాలెంజ్ చాలా రోజులుగా టిక్ టాక్ లో దుమ్ము దులుపుతోంది. ఈ పాస్ ది బ్రష్ ఛాలెంజ్ ను మెగా అమ్మాయిలు టేకప్ చేయడం విశేషం.

ఈ ఛాలెంజ్ లో భాగంగా మొదట బ్రష్ పట్టుకుని సహజంగా 'నో మేకప్ లుక్' లో కనిపించాలి. తర్వాత చక్కగా మేకప్ చేసుకుని కనిపించాలి. నిహారిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఈ వీడియో పోస్ట్ చేసింది. నిహారిక అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఈ వీడియోను పోస్ట్ చేసి "లాక్ డౌన్ లేడీస్. మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఫన్నీగా చేశాము.. ఇప్పుడు మీ టర్న్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది." నిహారికతో పాటుగా సుష్మిత, శ్రీజ, స్నేహ రెడ్డి.. మరికొంతమంది ఈ వీడియోలో బ్రష్ ను అందుకున్నారు.. చక్కగా రెడీ అయ్యారు.. నేపథ్యంలో ప్లే అవుతున్న బాద్షా 'వాఖ్రా స్వాగ్' పాటకు అనుగుణంగా రెండు స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా అందరూ ఈ ఛాలెంజ్ ను చక్కగా పూర్తి చేశారు.

ఈ వీడియోకు నెటిజన్ల నుండి మంచి స్పందనే దక్కింది. మెగా అమ్మాయిలు అద్భుతంగా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశారని చాలామంది మెచ్చుకున్నారు. కొందరేమో ఉపాసన కూడా ఉంటే బాగుండేదని అన్నారు. అయితే ఫన్.. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అలానే కొందరు నెటిజన్లు కూడా ఫన్ ను ఆస్వాదించలేరు. వారు మాత్రం విమర్శలు ఎక్కు పెట్టారు. ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతోంది. మన దేశంలో కూడు లేక.. ఇంటికి చేరలేక లక్షలమంది ఇబ్బంది పడుతుంటే మీరు ఈ మేకప్పు ఛాలెంజ్ తో టైం పాస్ చేస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News