విజయ్ లియోలో మెగా హీరో… క్లారిటీ ఏంటంటే?

Update: 2023-02-09 10:10 GMT
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా లియో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ యూనివర్స్ కాన్సెప్ట్స్ లో భాగంగానే ఈ మూవీ ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడని అతని లుక్ బట్టి తెలుస్తుంది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రంగంలోకి దించుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ కి ప్రతినాయకుడుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. విజయ్ కి జోడీగా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం, దానికి తోడు లోకేష్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఒక ఇంటరెస్టింగ్ గాసిప్ తెరపైకి వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ రోల్ లో లోకేష్ కనగరాజ్ ఫైనల్ చేసినట్లు కథనాలు వినిపించాయి.

 కోలీవుడ్ లో ఈ న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాపై ఉన్నారు. దీనిని ఫినిష్ చేసిన వెంటనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ప్రస్తుతం ఏ విధంగా కూడా వేరొక సినిమాకి కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడని తెలుస్తుంది.

దీంతో లోకేష్ కనగరాజ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. అయితే తెలుగు నుంచి ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఫేమ్ ఉన్న నటుడిని లోకేష్ కనగరాజ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అయితే అతను ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని మాత్రం తెలుస్తుంది. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News