వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తున్న మెగా ఫ్యామిలీ డెబ్యూ హీరో..!!
మెగా ఫ్యామిలీ డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్న సినిమా ‘ఉప్పెన’. ఈ డెబ్యూ హీరో సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండగా.. ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడంతో ఈ సినిమాకి తమిళంలో కూడా మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకోవడం.. కొత్త హీరోయిన్ క్రితి శెట్టి ఫ్రెష్ లుక్‌తో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టడంతో ఉప్పెన సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఉప్పెన సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హీరోలంతా సినిమాలను ఓకే చేసి లైన్ లో పెడుతున్నారు.
ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సినిమాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ క్రిష్ తో గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రెడీ అయిన ఉప్పెన త్వరలో విడుదల కానుందట. ఇక మరో రెండు కొత్త సినిమాలను ఈ మెగా హీరో లైన్ లో పెట్టినట్లు సమాచారం. అందులో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుండగా.. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనుందని తెలుస్తుంది. క్రిష్ తో సినిమా కంప్లీట్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కానుందట. ఇక షైన్ స్క్రీన్ వారితో కూడా ఒక సినిమా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మరి ఈ లెక్కన ఈ డెబ్యూ హీరో ఏడాదికి రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇవేగాక ఇంకా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. చూడాలి మరి మెగా హీరో ఏం చేయనున్నాడో..!!