పాడే మోసిన చిరంజీవి, రాంచరణ్

Update: 2020-06-01 05:00 GMT
తన కోడలు తాత చనిపోతే మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఆయన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించడంలో తోడ్పాటు నందిస్తున్నాడు. స్వయంగా చిరంజీవి, రాంచరణ్ పాడె మోయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా కోడలు తాత విషయంలో చిరంజీవి తీసుకున్న చొరవ అందరినీ ఆకర్షించింది..

మెగా స్టార్ కోడలు ఉపాసన వాళ్ల తాత, మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ కోట వారసుడు అయిన ఉమాపతిరావు  అస్వస్థతతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు.

ఆదివారం ఆయన మృతదేహాన్ని దోమకొండకు తీసుకొచ్చారు. ఆయన కూతురు అమెరికాలో ఉండడం.. ఆమె రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలకు లేట్ అయ్యింది.

ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కోటలోని వెంకట భవనంలో ప్రజల సందర్శనార్థం ఉమపతిరావు భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం స్థానిక ముత్యంపేట రోడ్డులోని లక్ష్మీబాగ్ లో ఉమాపతిరావు అంతిమ సంస్కారాలను ఆయన కుమారుడు అనిల్ కుమార్-శోభన దంపతులు నిర్వహించారు.

అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఉమాపతిరావు అంతిమయాత్రలో చిరంజీవి, రాంచరణ్ లు స్వయంగా పాల్గొని ఆయన పాడెను మోయడం అందరినీ ఆకట్టుకుంది.
Tags:    

Similar News