ఆ స్టార్‌ కిడ్స్‌ ప్రేమ వ్యవహారంపై క్లారిటీ

Update: 2021-02-09 03:30 GMT
బాలీవుడ్‌ బిగ్ బి అమితాబచ్చన్‌ మనుమరాలు నవ్య నవేలి మరియు ప్రముఖ నటుడు జావేద్‌ జాఫెర్రీ తనయుడు మీజాన్‌ జాఫెర్రీల మద్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది అంటూ గత కొన్నాళ్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో వీరి వ్యవహారం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అందుకు వారు స్పందించక పోవడంతో ఇద్దరి మద్య వ్యవహారం నిజంగానే ఉందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ కూడా నమ్ముతూ వచ్చాయి. కాని ఆ వార్తలు పూర్తిగా పుకార్లే అని వాటిని నమ్మాల్సిన అవసరం లేదు అంటూ జావేద్‌ జాఫెర్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫుల్‌ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది.

నవ్య.. మీజాన్‌ జాఫెర్రీల మద్య ఉన్న వ్యవహారం గురించి జావెద్‌ జాఫెర్రీని తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇద్దరు కూడా చిన్నతనం నుండి స్నేహితులు. ఒకే స్కూల్‌ లో చదువుకోవడంతో పాటు అనేక సందర్బాల్లో కలుస్తూ ఉంటారు. అంతే తప్ప వారి మద్య ప్రేమ కాని మరేం కాని లేదు అంటూ తేల్చి చెప్పాడు. వారు స్నేహితులు మాత్రమే అని వారిద్దరికి కూడా ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఒక హద్దు వరకు వారు స్నేహంగా ఉన్నా కూడా కొందరు కావాలని పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని జావేద్‌ చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో నవ్య మరియు మీజాన్ లు మాత్రం స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తుంది.
Tags:    

Similar News