#SSMB28 సూపర్ స్క్వాడ్: మహేష్ తో మరోసారి పూజా రొమాన్స్..!

Update: 2021-08-09 11:35 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో 'అతడు' 'ఖలేజా' వంటి క్లాసిక్స్ వచ్చిన 11 ఏళ్ల తర్వాత రూపొందనున్న ఈ చిత్రాన్ని '#SSMB28' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ మరియు టెక్నికల్ టీమ్ ని ప్రకటించారు.

#SSMB28 చిత్రంలో మహేష్ బాబు కు జోడీగా పూజాహెగ్డే ని ఫైనలైజ్ చేశారు. గతంలో మహేష్ తో 'మహర్షి' చిత్రంలో నటించిన పూజా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాల్లో వర్క్ చేసింది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. త్రివిక్రమ్ తో కలిసి మూడోసారి పని చేస్తున్న థమన్.. ఇంతకముందు మహేష్ హీరోగా నటించిన నాలుగు చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 'సర్కారు వారి పాట' చిత్రానికి కూడా ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఇకపోతే 'సర్కారు వారి పాట' చిత్రానికి వర్క్ చేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ - సినిమాటోగ్రాఫర్ మది #SSMB28 చిత్రానికి కంటిన్యూ అవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ని ఈ సినిమా కోసం ఎంపిక చేసారు. స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్వీట్ చేస్తూ.. ''సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని, మేము మీకు #SSMB28 యొక్క సూపర్ స్క్వాడ్‌ ను అందిస్తున్నాము. త్రివిక్రమ్ మంత్రముగ్ధమైన కథ త్వరలో సెట్స్‌ పైకి రానుంది'' అని పేర్కొన్నారు.

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై ఎస్. రాధాకృష్ణ‌ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని చిత్ర బృందం మొదట నుంచీ చెబుతూ వస్తోంది. 'సర్కారు వారి పాట' తదుపరి షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత '#SSMB28' సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Full View
Tags:    

Similar News