• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ మూవీకోసం మాస్...

పవన్ మూవీకోసం మాస్ డైరెక్టర్ కాస్టింగ్..??

By - Tupaki Desk
Update: 2021-05-20 14:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ తో పాటు ఊరమాస్ అంశాలను ప్రధానంగా తెరకెక్కించే మాస్ దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. అయితే ఫస్ట్ నుండి తన సినిమాల్లో క్లాస్ మాస్ అంశాలు మేళవించి సినిమాలు రూపొందించాడు. అదేవిధంగా ఆయన డైరెక్షన్ టేకింగ్ విధానంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ రెండేళ్లుగా హరీష్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఎందుకంటే రెండేళ్లు విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తదుపరి సినిమా చేయనున్నాడు హరీష్. 2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత హరీష్ నుండి మరో సినిమా రాలేదు. రెండేళ్లుగా కేవలం పవన్ కళ్యాణ్ సినిమా పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం 9సంవత్సరాలకు ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.

అయితే ఈ కాంబినేషన్ మూవీ స్క్రిప్ట్ దశలో ఉండగానే సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబో గురించి ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హవా చూస్తే అర్ధమవుతుంది. వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ రీఎంట్రీ తర్వాత పవన్ సినిమాలకు చాలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే హిస్టోరికల్ మూవీ చేస్తూనే.. మరోవైపు సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసాక పవన్ హరీష్ శంకర్ మూవీ చేయనున్నాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో స్క్రిప్ట్ ఇటీవలే పూర్తి చేసినట్లు హరీష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే పవన్ సినిమా కోసం హరీష్ నటినటుల ఎంపిక జరుపుతున్నట్లు టాక్. సినిమాలోని ప్రధాన క్యారెక్టర్స్ సంబంధించిన యాక్టర్స్ తో డైరెక్టర్ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదిగాక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. హరీష్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలా కెరీర్ తీసుకున్నాడట. ఎందుకంటే అటు పవన్ పొలిటికల్ కెరీర్ కూడా భంగం కలగకుండా స్క్రిప్ట్ లో జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. చూడాలి మరి ఈ మాస్ డైరెక్టర్ పవన్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో!
Tags:    
  • gabbar singh 
  • Pawan kalyan 
  • Harish Shankar 
  • Pspk28 
  • Pawan Kalyan New Movie 

Similar News

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

2026-11-10 06:01 GMT

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

2026-11-10 06:00 GMT

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS