• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌లైకా స‌వ‌తి పెళ్లి ఊసే...

మ‌లైకా స‌వ‌తి పెళ్లి ఊసే లేదు.. ద‌ర్శ‌క‌త్వ‌మే టార్గెట్!

By - Tupaki Desk
Update: 2022-11-28 04:37 GMT
మ‌లైకా అరోరా - ఆర్భాజ్ ఖాన్ జంట బ్రేక‌ప్ గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రి ఎఫైర్లు బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ జంట‌ దాదాపు 20 ఏళ్ల బంధాన్ని వ‌దులుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే విడాకుల‌ కంటే ముందే మ‌లైకా అరోరా ప్ర‌ముఖ బాలీవుడ్ యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో సాన్నిహిత్యంలో ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. అప్ప‌టికే ఆర్భాజ్ ఖాన్ విదేశీ మోడ‌ల్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్ చేయ‌డంపైనా గుస‌గుస‌లు వినిపించాయి. విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం ఎవ‌రికి వారు త‌మ ఇత‌ర భాగ‌స్వాముల‌తో ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం మ‌రో బిగ్ ట్విస్ట్. ఆధునిక భార‌త‌దేశంలో ఇప్పుడు ఇలాంటివ‌న్నీ నిత్య దృశ్యమానాలు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు కం నిర్మాత ఆర్బాజ్ తో తన సంబంధం.. పెళ్లి పుకార్ల గురించి  జార్జియా ఓపెనైంది. జార్జియా ఆండ్రియాని త‌న‌పై అన్ని పుకార్లకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఆమె మాట్లాడుతూ''నేను ఇదివ‌ర‌కూ చెప్పినట్లు మేము ఎప్ప‌టికీ చాలా మంచి స్నేహితులం. కానీ పెళ్లి గురించి అడిగితే..  నిజం చెప్పాలంటే.. ఇది మేం నిజంగా చూడని విషయం'' అంటూ స్ప‌ష్టంగా మాట్లాడారు. ఇప్ప‌ట్లో పెళ్లాడే ఉద్ధేశం లేద‌ని భ‌విష్య‌త్ లోను దాని గురించి ప్ర‌స్థావించాల్సిన అవ‌స‌రం లేద‌నే ఆమె ఉద్ధేశం బ‌య‌ట‌ప‌డింది.

కానీ ఈ ఇంట‌ర్వ్యూలో ఆర్బాజ్ తో త‌న సాన్నిహిత్యం గురించి ప్ర‌తిదీ ఓపెన్ గానే మాట్లాడారు జార్జియా. మహమ్మారి సమయంలో లాక్ డౌన్ వారి మ‌ధ్య బంధాన్ని పెనుబంధంగా ఎలా మార్చిందో వెల్ల‌డించింది. ''లాక్ డౌన్ మమ్మల్ని ఆలోచింపజేసింది. నిజానికి ఇది ప్రజల్లో చాలా మార్పులు తెచ్చింది. అలాగే మా ఆలోచ‌న‌ల‌ను కూడా మార్చింది'' అని తెలిపింది.

అర్బాజ్ ఖాన్ త‌న‌ మాజీ భార్య మలైకా అరోరా నుంచి విడిపోయిన తర్వాత ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానితో బ‌హిరంగంగా కలిసి షికార్లు చేయ‌డం తెలిసిందే. అంత‌కుముందు ఈ ఇద్ద‌రి బంధంపై కేవ‌లం గుస‌గుస‌లు మాత్ర‌మే వినిపించాయి. మ‌లైకా-ఆర్బాజ్ జంటకు అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్దరూ దాదాపు 20 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికారు.

అదే ఇంటర్వ్యూలో ఖాన్ కుటుంబాన్ని మాత్రమే కాదు.. ఆర్భాజ్ మాజీ భార్య మలైకా అరోరాను కూడా తాను ఇంత‌కుముందు కలుసుకున్నాన‌ని కూడా ఆండ్రియానీ వెల్లడించింది. నటుడు గుర్మీత్ చౌదరితో కలిసి మ్యూజిక్ వీడియో చేస్తున్న జార్జియా ఆండ్రియానీ బాలీవుడ్ లోకి ప్రవేశించారు.

ద‌ర్శ‌కురాలిని అవ్వ‌డ‌మే నా టార్గెట్:

జార్జియా ఆండ్రియాని బాలీవుడ్ లో ఏమ‌వ్వాల‌నుకుంటున్నారు? ఈ ప్ర‌శ్న‌కు కూడా స‌మాధాన‌మిచ్చారు. తన కెరీర్ ప్ర‌ణాళిక‌ గురించి మాట్లాడుతూ 'డైరెక్టర్' కావాలనుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది. నిజానికి ఆండ్రియాని మోడ‌ల్ ట‌ర్న్ డ్ న‌టి. 'గెస్ట్ ఇన్ లండన్‌'లో క్లుప్తంగా అతిథి పాత్రలో కనిపించిన తర్వాత  'కరోలిన్ కామాక్షి'తో తన డిజిటల్ అరంగేట్రం చేసింది. అటుపై ఇటాలియన్ మోడల్ -నటి జార్జియా ఆండ్రియాని తరచుగా తన అద్భుతమైన డిజైన‌ర్ లుక్స్ తో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2022లో బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్ కానీ మ్యూజిక్ వీడియో కానీ చేయకపోయినా త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి మీడియా లో తరచుగా ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి. కానీ ఇప్పుడు త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌టికి చెప్పేసింది. తాను  బాలీవుడ్ లో డైరెక్టర్ కావాలని క‌ల‌లుగంటున్న‌ట్టు ఒప్పుకుంది.

నేను మ్యూజిక్ వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మీరు వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కురాలిగా ప్ర‌య‌త్నిస్తాను. ఒక  సినిమా మూడు గంటల నిడివితో ఉంటుంది. అది చాలా కమ్యూనికేట్ చేస్తుంది. క‌చ్చితంగా చాలామందితో కనెక్ట్ అవ్వడానికి సినిమాతో చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే మూడు నిమిషాల మ్యూజిక్ వీడియోలో చాలా సింపుల్ గా ఇప్పటికీ ఆ అవకాశం ఉంది. నేను ద‌ర్శ‌కురాలిని కావాల‌ని అనుకుంటే నా ద‌గ్గ‌ర క‌థ ఉంది. స‌త్సంబంధాలు ఉన్నాయి. నేను చేయ‌గ‌ల‌ను. కానీ ఇది నా కెరీర్ ప్రారంభం కాబట్టి నేను చేసే ప‌నిని ప్రేమిస్తున్నాను. మ్యూజిక్ వీడియోలు ప్రస్తుతానికి నా ప్రణాళిక. త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం'' అని ప్ర‌తిదీ ఓపెనైంది.

మ‌నం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో మ‌న‌కు తెలుసని నేను భావిస్తాను. కానీ అది విధికి సంబంధించినది కూడా.. ప్రస్తుతానికి నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను. స్క్రిప్ట్ రైటింగ్ ప్రయత్నించడంతో పాటు దర్శకురాలిన‌వ్వాల‌నే ప్రణాళిక ఉంది... అని తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ArbaazKhan 
  • GeorgiaAndriani 
  • MalaikaAroraExHusband 
  • ArhanKhan 
  • ArbaazGeorgiaMarriage 
  • BollywoodFilmIndustry 
  • CelebrityCouple 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS