కృష్ణ కూతురు మెగాఫోన్ పట్టేస్తోంది

Update: 2016-10-31 05:27 GMT
హీరోయిన్ గా వెలిగిపోదామన్న కృష్ణ కూతురు మంజుల ఆశలకు అభిమానులు బ్రేక్ వేసేశారు. ఆమె హీరోయిన్ కావడానికి కృష్ణ అభిమానులు అంగీకరించకపోవడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఐతే హీరోయిన్ కాకపోయినా.. కొన్నేళ్ల తర్వాత ‘షో’ సినిమాతో నటిగా తనేంటో రుజువు చేసుకుంది మంజుల. ఆ తర్వాత ‘కావ్యాస్ డైరీ’ లాంటి ఒకట్రెండు సినిమాల్లోనూ కనిపించింది. మధ్య మధ్యలో నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది మంజుల. ఐతే ఇప్పుడు మంజుల తనలోని కొత్త టాలెంట్ చూపించబోతోంది. ఆమె త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నట్లు సమాచారం.

యువ కథానాయకుడు సందీప్ కిషన్ తో మంజుల తన డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ చేస్తుందని సమాచారం. ఇటీవలే అతడికి కథ కూడా వినిపించిందట. మంజుల చెప్పిన వైవిధ్యమైన కథ విని సందీప్ కిషన్ సంతోషంగా ఈ సినిమా ఒప్పేసుకున్నాడట. నటిగా.. నిర్మాతగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన మహేష్ అక్క.. మెగా ఫోన్ పట్టి ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని ఆమే స్వయంగా నిర్మించవచ్చని సమాచారం. ప్రస్తుతం సందీప్ కిషన్.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ ఒకట్రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. అవి పూర్తి కాగానే మంజుల సినిమా చేస్తాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News