ఆ కేసులో సాక్ష్యం చెప్పిన మంచు విష్ణు
ఈ మధ్య సెన్సార్ వాళ్ల ఆగడాలు మామూలుగా లేవు. సెన్సార్ కోసం వచ్చిన సినిమాల్ని పైరసీ చేసి ఆన్ లైన్ లో వదలడం... కట్స్ లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడం.. అబ్బో కొందరు అధికారుల అతి పరాకాష్టకు చేరింది. సెన్సార్ వాళ్ల వల్ల అన్ని ఇండస్ట్రీల వాళ్లూ ఇబ్బంది పడుతున్నారు. మన తెలుగు సెన్సార్ బోర్డు విషయానికి వస్తే.. ధనలక్ష్మి అనే అధికారి ఉన్నపుడు వ్యవహారం చాలా స్ట్రిక్టుగా ఉండేది కానీ.. ఆమె మన సినిమాల విషయంలో మరీ కఠినంగా ఉండటంతో నిర్మాతలు, దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఐతే ఆమె వెళ్లిందిలే అని ఊపిరి పీల్చుకుంటే.. ఇప్పుడు కొందరు లంచాధికారులు తయారయ్యారు. చిన్న సినిమాలకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచాలు అడగడం మొదలుపెట్టారు.
ఇలా ఈ మధ్య ఓ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి శ్రీనివాసరావు అనే అధికారి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వ్యవహారం చాలా సీరియస్ కావడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. శ్రీనివాసరావును అరెస్టు చేసి.. విచారణ సాగిస్తున్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రము నటుడు, నిర్మాత మంచు విష్ణు.. సోమవారం హైదరాబాదు లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లాడు. గతంలో విష్ణు ఓ సినిమా సెన్సార్ విషయంలో అధికారితో గొడవ పడ్డాడు. తనను లంచం అడిగినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే విష్ణుని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. సెన్సార్ అధికారుల తీరుపై విష్ణు అభిప్రాయం తెలుసుకోవడానికే అతణ్ని అధికారులు పిలిచినట్లు తెలుస్తోంది. పరిశ్రమకు చెందిన మరింత మంది అభిప్రాయాల్ని ఈ కేసులో పరిగణనలోకి తీసుకోబోతున్నారు.