తండ్రి పుట్టిన రోజున మంచు విష్ణు భారీ విరాళం
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న మంచు మోహన్ బాబు తనయుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మంచు విష్ణు మల్టీ ట్యాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా - స్టంట్స్ కొరియోగ్రఫర్ గా కూడా చేశాడు. ఒకటి రెండు సినిమాలకు రచయితగా కూడా వ్యవహరించిన మంచు విష్ణు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. మంచు ఫ్యామిలీ నుండి విష్ణు - మనోజ్ - లక్ష్మిలు తరచు ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహించడం లేదా ఏదైన మంచి పనిలో పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి మంచు విష్ణు తన మంచితనంను చాటుకున్నాడు. ఈసారి ఏకంగా కోటి రూపాయల ఆర్థిక సాయంను అందించేందుకు సిద్దం అయ్యాడు.
తిరుపతి రుయా హాస్పిటల్ లో మౌళిక వసతులను కల్పించేందుకు కోటి రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. తన తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా మంచు విష్ణు ఈ సంచలన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. తిరుపతి రుయా హాస్పిటల్ లోని ఐసీయూ మరియు ఎమర్జెన్సీ విభాగాలకు సంబంధించి అత్యాధునిక వసతులు కల్పించేందుకు మంచు విష్ణు ఆర్ధిక సాయం వినియోగించనున్నారు. అందుకోసం విష్ణు నేడు మొదటి విడత చెక్ ను కూడా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
తండ్రి పుట్టిన రోజు సందర్బంగా మనోజ్ ఒక పాపను దత్తత తీసుకుని ఆ పాప చదువు పూర్తి అయ్యే వరకు తాను ఆర్థికంగా సాయం చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. మొత్తానికి ఈ అన్నదమ్ములు తన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా భారీ విరాళాలు ఇస్తూ - నలుగురికి మంచి చేయాలని భావించడం నిజంగా అభినందనీయం. మంచు హీరోలు ఇతర హీరోలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.