నా సంగతి భార్యకు తెలుసంటున్న విష్ణు

Update: 2016-03-03 04:57 GMT
మంచు విష్ణు-వెరోనికాల పెళ్లి రోజు ఇవాళ. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ ఇప్పుడు ఏడో యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఈ సమయంలో భార్యతో తన అనుబంధాన్ని ఓ అందమైన మెసేజ్ ద్వారా చెప్పాడు మంచు వారబ్బాయి విష్ణు. ఆమె లాంటి భార్య లభించడం తన అదృష్టమంటూ విష్ణు చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.

'అందమైన అమ్మాయిలను నువ్వు ఫ్లర్ట్ చేస్తూ ఉంటావ్. నీ లాంటి మొగుడు కానీ.. బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే.. నీకు  కట్ చేసేసేదాన్ని' అని హన్సిక ఓసారి చెప్పిందట. 'నేను హన్సిక మాటలను యాక్సెప్ట్ చేస్తా. నేను చాలామందితో రొమాన్స్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, అందమైన భామలతో కలిసి తిరుగుతాను. ఇది నా ప్రొఫెషన్. చాలామందితో సరదాగా సరసం కూడా ఆడతాను. ఈ విషయం వినికి తెలుసు' అన్న మంచు విష్ణు.. భర్తగా తనెలా ఉంటాడో కూడా పోస్ట్ లో రాశాడు.

'నేను ఏడాదిలో 400రోజులు భార్య సహనానికి టెస్ట్ పెడుతూ ఉంటాను. యానివర్సరీలు - బర్త్ డే ఈవెంట్లు - కలిసి డిన్నర్ చేయడం అన్నీ మిస్ చేస్తుంటా. తొందరగా నిద్రపోయి.. ఆమె లేచేలోపలే షూటింగ్ కి వెళ్లిపోతాను. ఇప్పటివరకూ తనని హనీమూన్ కి కూడా తీసుకెళ్లలేదు. అయినా ఎటువంటి కండిషన్లు లేకుండా నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. పొద్దున్నే ఆమె మొహాన్ని చూసినపుడు.. దేవుడు నాకిచ్చిన వరం విని అనిపిస్తుంది. హ్యాపీ యానివర్సరీ వినీ' అంటూ రాసుకొచ్చాడు మంచు విష్ణు.
Tags:    

Similar News