• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అంకుల్.. తొందరపడకండి':...

'అంకుల్.. తొందరపడకండి': ప్రకాష్ రాజ్ రాజీనామా పై మంచు విష్ణు..!

By - Tupaki Desk
Update: 2021-10-11 11:51 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ఈరోజు 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని.. అతిథిగా వచ్చాను కాబట్టి అతిథిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నానని ఆయన అన్నారు. రాజీనామా ప్రకటన విషయాన్ని 'మా' ప్రెసిడెంట్ గా గెలిచిన మంచు విష్ణు కు ప్రకాష్ రాజ్ వాట్సాప్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

''డియర్ విష్ణు.. 'మా' ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. 'మా' ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్ మెంబర్ గా మీకు అన్ని విధాలా సాయం చేస్తాను.. థ్యాంక్యూ'' అని మంచు విష్ణు కు ప్రకాష్ రాజ్ వాట్సాప్ మెసేజ్ చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ విష్ణు రిప్లై ఇచ్చారు.

''డియర్ అంకుల్.. థాంక్యూ.. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనే విషయం మీకు తెలుసు. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దని కోరుతున్నాను. మా కుటుంబలో మీరు కూడా భాగమే. నాకు మీ ఆలోచనలు అవసరం. మనం కలిసి పనిచేయాలి. మీరు ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. ఐ లవ్ యు అంకుల్. ప్లీజ్ తొందరపడకండి'' అని మంచు విష్ణు సమాధానంలో పేర్కొన్నారు.

కాగా, 'మా' ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ రోజు సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రాంతీయవాదం వల్ల తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని.. 'మా' సభ్యుల నిర్ణయాన్ని గౌరవిస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు. తనకు ఆత్మ గౌరవం ఉందని.. ఇకపై 'మా' అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని.. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన తెలిపారు. తెలుగు వ్యక్తి కానివాడు ఓటు వేయవచ్చు.. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే నినాదం కరెక్ట్‌ కాదని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Tags:    
  • MAA 
  • Prakash Raj 
  • Vishnu Manchu 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS