'సన్ ఆఫ్ ఇండియా' కోసం మోహన్ బాబుకి స్టైలింగ్ చేస్తున్న కోడలు మంచు విరానిక..!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కొత్త చిత్రం ''సన్ ఆఫ్ ఇండియా'' ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ ఎగ్జయిటింగ్ గా ఉందని పేర్కొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు లక్ష్మి ప్రసన్న - నిర్వాణ క్లాప్ కొట్టగా.. విరానిక మంచు - ఐరా - అవ్‌రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మంచు విష్ణు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా మంచు - విరియానా మంచు స్క్రిప్ట్ ను డైరెక్షన్ టీమ్ కి అందజేశారు. ఈ చిత్రం కోసం మంచు విష్ణు సతీమణి విరానిక మొదటిసారి మోహన్ బాబుకు స్టైలింగ్ చేస్తోంది. అలానే మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఇలా ఈ చిత్రం కోసం మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండగా కోడలు విరానిక మొదటిసారి స్టైలింగ్ చేస్తోందన్నమాట.
'సన్నాఫ్ ఇండియా' చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించనున్నారు. సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించనున్నారు. డైమండ్ రత్నాబాబు - తోటపల్లి సాయినాథ్ డైలాగ్స్ అందిస్తున్నారు. 560కి పైగా చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మోహన్ బాబు మరోసారి దేశభక్తి ప్రధానంగా రూపొందుతోన్న చిత్రంతో ప్రేక్షకులు ముందుకురానున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన 'సన్నాఫ్ ఇండియా' టైటిల్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది.