కుర్ర హీరో కోసం టైటిల్ వదిలేసుకున్నాడే !
కొన్ని టైటిల్స్ లో ఏదో తెలియని పవర్ ఉంటుంది. సౌండింగ్ వినగానే పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. సరిగ్గా అలాంటి పవర్ ఫుల్ టైటిల్ నే పట్టాడు మంచు మనోజ్. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న ఈ హీరో కొత్త దర్శకుడు చెప్పిన కథకి ఇంప్రెస్ అయి తన సొంత ప్రొడక్షన్ లో సినిమా చేసేందుకు నిర్ణయం తీసుకొని టైటిల్ తో పాటు డీటెయిల్స్ కూడా చెప్పాడు.
అయితే ఈ టైటిల్ ను గతంలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రిజిస్టర్ చేయించుకున్నాడు. తన బ్యానర్ లో ఈ టైటిల్ తో సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆ మధ్య క్రిష్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించగానే అల్లు అర్జున్ , రానా లతో ఈ సినిమా చేస్తాడని ఏవో వార్తలు చక్కర్లు కొట్టాయి. కట్ చేస్తే ఎన్టీఆర్ సిరీస్ తర్వాత డీలా పడిన క్రిష్ కొంత బ్రేక్ తీసుకొని ఫైనల్ గా పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేసి సినిమా చేస్తున్నాడు.
ఇక సరిగ్గా తన కథకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని క్రిష్ ను సంప్రదించాడు మనోజ్. గతంలో ఇద్దరూ కలిసి వేదం సినిమా చేసారు. అదే రిలేషన్ షిప్ తో మనోజ్ అడిగిన వెంటనే పాన్ ఇండియా సినిమా కోసం టైటిల్ ను ఇచ్చేసాడట క్రిష్. సో అలా ఓ పెద్ద సినిమాకు పెట్టాల్సిన టైటిల్ ను తన భారీ బడ్జెట్ సినిమా కోసం తీసుకొని లేటెస్ట్ గా అనౌన్స్ చేసేశాడు మనోజ్. ఏదేమైనా ఈ పవర్ ఫుల్ టైటిల్ మనోజ్ కి రాసిపెట్టి ఉందనుకుంటా.