మంచు లక్ష్మి ఓపెన్ లెటర్

Update: 2017-02-23 17:40 GMT
సామాజిక సమస్యలపై స్పందించడంలో మంచు లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. రీసెంట్ గా మలయాళ నటి భావనకు ఎదురైన పరిస్థితిపై ఇప్పుడు స్పందించిన మంచు లక్ష్మి.. ఇన్నాళ్లు తాను స్పందించలేకపోవడానికి కారణం.. ఈ విషయం తెలియగానే షాక్ కి గురయ్యానని అంటోంది. ఓపెన్ లెటర్ ద్వారా భావన ఎపిసోడ్ పై తన అభిప్రాయాలను పంచుకుంది మంచు లక్ష్మి.

'మన దేశంలో దేవతలుగా పూజిస్తాం. లేకపోతే డోర్లు వేసి బంధించి దాచిపెడతాం. అదృష్టవంతులు ఎవరంటే.. అమ్మ.. భార్య అంతే. కానీ లక్ష్మి.. పార్వతి.. దుర్గ.. సరస్వతి లాంటి దేవతలను ప్రార్ధించడం కరెక్టేనా? ఇలాంటివి జరగడం ఇదేమీ కొత్త కాదు. మనకు ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. వేధించడం.. కిడ్నాప్.. అవమానం.. రేప్.. లాంటి ఘటనలు సహజం అయిపోయాయి. మీడియా ఆమె పేరును బయటపెట్టి ఈ పరిస్థితిని మరింత వరస్ట్ గా మార్చేసింది' అని అభిప్రాయపడింది మంచు లక్ష్మి.

అయితే.. తన మలయాళీ సోదరికి ఎదురైన పరిస్థితి మాత్రం 'సహజం కాదు' అనే విషయం అర్ధం చేసుకోవాలని రాసుకొచ్చింది మంచు లక్ష్మి. నలుగురు ఉన్న రోడ్ లోను.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కూడా భయపడాల్సిన పరిస్థితి కారణం ఇప్పుడున్న పరిస్థితులే అంటున్న మంచు లక్ష్మి.. ఈ ఉదంతం తెలిశాక తాను కూడా అభద్రతా భావానికి గురయ్యానని చెప్పింది.
Tags:    

Similar News