• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మంచి రోజులు వచ్చాయి'...

'మంచి రోజులు వచ్చాయి' కోసం సిద్ శ్రీరామ్ పాడిన మెలోడీ ప్రోమో..!

By - Tupaki Desk
Update: 2021-08-11 06:41 GMT
'ప్రతిరోజూ పండగే' వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ''మంచి రోజులు వచ్చాయి''. ఇందులో 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు క్యారక్టర్స్ ఇంట్రో లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'మంచి రోజులు వచ్చాయి' చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ''సో సోగా'' అనే మెలోడీ సాంగ్ ప్రోమోని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

'సో సోగా ఉన్నానని.. సో స్పెషలే చేసావులే.. సోలో గా నేను బోరై ఉంటే.. చిన్ని బేబీ.. ముద్దు బేబీ.. లవ్లీ బేబీ..' అంటూ సాగిన ఈ ప్రోమో, అందరూ పూర్తి సాంగ్ కోసం ఎదురు చూసేలా చేసింది. యువ మ్యూజిక్ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ పాటను తనదైన శైలిలో పాడి ఆకట్టుకున్నాడు. 'ఒకటే ఒకటేలే నువ్వు నేనూ ఒకటలే.. తనువులు రెండైనా.. ఊపిరి ఒకటేలే..' అంటూ దీనికి కె.కె మంచి సాహిత్యం అందించారు. ఇందులో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. చివర్లో సంతోష్ వేసే డ్యాన్స్ మూవ్స్ కూడా అలరిస్తున్నాయి.

'సో సోగా' బ్యూటీఫుల్ మెలోడీకి అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ లవ్లీ సాంగ్ ఫుల్ వీడియోని ఆగస్ట్ 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. UV కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ మరియు SKN నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




Full View

Tags:    
  • Manchi Rojulochaie 
  • Manchi Rojulochaie teaser 
  • Santhosh Shoban Manchi Rojulochaie 
  • Manchi Rojulochaie promo song 

Similar News

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS