మొత్తం చూపించేస్తే ఏమనలేదు... సగం చూపిస్తే కేసులా..?

Update: 2015-05-25 22:30 GMT
బాలీవుడ్‌ సెక్స్‌ బాంబ్‌ సన్నీ లియోన్‌ ఒకదాని తరువాత ఒక ఇబ్బందుల్లో చిక్కుకుంటోంది. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదవగా తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. సన్నీ లియోన్‌ తోపాటు గూగుల్‌ సీఇవో, ఓ బాలివుడ్‌ మేగజిన్‌ మీద అజ్మీర్‌ నగర పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ తయారు చేసి విచారణ చేస్తున్నారు.

    తాను ఓ బాలీవుడ్‌ మేగజిన్‌ కు చెందిన వెబ్‌ సైట్‌ ను ఫాలో అవుతుంటానని, అందులో సన్నీ లియోన్‌ అసభ్యకరమైన ఫోటోలు, క్లిప్పింగ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారని ఆరిందామ్‌ జైన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవలి కాలంలో ఆ మేగిజిన్‌ వెబ్‌ సైట్‌ లో సన్నీ లియోన్‌ అసభ్యకరమైన ఫోటోలన్నీ పెడుతున్నారని... అందులో రాతలు కూడా సెక్సీగా ఉన్నాయంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీంతో... అసభ్యకరంగా ఉండే పుస్తకాలు విక్రయించడం, భారతీయ మహిళ ప్రాతినిధ్య చట్టం ప్రకారం సన్నీ లియోన్‌ పద్ధతి లేని నడవడికపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో సోషల్‌ మీడియాలో సన్నీలియోన్‌ బూతు సినిమాలు ఉన్నాయని పలువురు ఆరోపించారు. మహారాష్ట్రలోని థానె నగరంలో అంజలీ పాలెన్‌ అనే మహిళ సన్నీ లియోన్‌ మీద కేసు పెట్టారు. పలు వెబ్‌ సైట్‌ లలో సన్నీ లియోన్‌ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, కథనాలు ఉన్నాయని, పిల్లల మీద ఆ ప్రభావం పడుతున్నదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ సొంత వెబ్‌ సైట్‌ సన్నీ లియోన్‌ . కాం చూసి యువత చెడుదోవపడుతున్నదని ఆరోపణలు వచ్చాయి. థానె పోలీసులు సన్నీ లియోన్‌ మీద పలు సెక్షన్‌ ల కింద కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ తయారు చేశారు.

    పాపం.... సన్నీ బూతు సినిమాలు వదిలేసి అందరిలో అందాల ఆరబోతతో బాలీవుడ్‌ సినిమాలు తీసుకుంటూ ప్రేక్షకులు ఉన్నంతలో చూపిస్తూ హాయిగా బతికేస్తున్నా కేసులు మాత్రం తప్పడం లేదు. హాయిగా అమెరికాలో ఉన్నంతకాలం నచ్చినట్లు బూతు సినిమాలు తీసుకున్నా ఎవరూ అడగలేదని... ఇక్కడ మాత్రం ఆరారగా చూపిస్తున్నా కేసులు పెడుతున్నారని సన్నీ వాపోతుందట.

Tags:    

Similar News