275 రోజులు బందీగా ఉండిపోయిన స్టార్ హీరో !

Update: 2020-12-08 05:12 GMT
ఎటువంటి పాత్రలనైనా అలవోకగా చేయగల విలక్షణ నటుడు మమ్ముట్టి.  మలయాళ నటుడైనప్పటికీ స్వాతి కిరణం, దళపతి ఇటీవల వచ్చిన యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతో సుపరిచితుడు. స్వాతి కిరణం చిత్రంలో ఆయనకు చూసినవారు ఎవరైనా తెలుగు వారు  కాడంటే నమ్మలేరు. అంత సహజంగా నటిస్తారాయన. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోవడం ఆయనకు అలవాటు. క్లాస్​ మాస్​ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న నటుడు మమ్ముట్టి. సినిమాల్లో ఎటువంటి పాత్రనైనా పోషించే మమ్ముట్టి.

జీవితంలోనూ సవాళ్లను అంతే తేలిగ్గా ఎదుర్కోగలడు. ఇటీవల కరోనా యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు కూడా లాక్​డౌన్​ విధించాయి. అయితే మమ్మట్టిని కూడా డాక్టర్లు కరోనా దరిచేరకుండా ఉండేందుకు కొన్ని సూచనలు చేశారట. వీలైనన్ని రోజులు ఇంట్లో ఉండాలని.. షూటింగ్​, ఇతర కార్యక్రమాలు పక్కన పెట్టి కరోనా వ్యాక్సిన్​ వచ్చేవరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారట. దీంతో మమ్ముట్టికి డాక్టర్ల సలహాను ఫాలో అయ్యాడు.

మరోవైపు తాను ఎంతకాలం స్వీయ నిర్బంధంలో ఉండగలడో కూడా చూడాలనుకున్నాడట. అయితే అలా 275 రోజులపాటు ఆయన ఇంటికే పరిమితమయ్యారట. దాదాపు తొమ్మిది నెలలు ఆయన ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. 275 రోజులు పూర్తయ్యాక గత శుక్రవారం బయటకొచ్చి స్నేహితులను కలుసుకున్నాడు. వారితో సరదాగా టీ తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. అయితే బిజీగా ఉండే ఓ నటుడు. ప్రతిరోజు బయటతిరిగే వ్యక్తి తొమ్మిదినెలల పాటు ఇంట్లో ఉండటం చాలా గ్రేట్​ అని సోషల్​మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
Tags:    

Similar News